టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ అనిపించుకోకపోయినా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న డైరెక్టర్ గా మారుతి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈరోజుల్లో, బస్ స్టాప్ సినిమాలతో దర్శకునిగా కెరీర్ ను మొదలుపెట్టిన మారుతి ఆ సినిమాలతో సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో పాటు పెద్ద హీరోల దృష్టిలో పడ్డారు. అయితే సినిమాల్లోకి రాకముందు మారుతి ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కోవడం గమనార్హం. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మారుతి ఉద్యోగం వదులుకుని సినిమాలపై ఉన్న ఆసక్తితో తాను సినిమాల్లోకి వచ్చానని చెప్పారు.
మొదట యాడ్స్, యానిమేషన్ వైపు అడుగులు వేసిన తాను ఆ తరువాత దర్శకుడిగా ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నానని మారుతి చెప్పుకొచ్చారు. తమ కుటుంబం మధ్యతరగతి కుటుంబం అని నాన్న అరటిపండ్లు అమ్మేవారని మారుతి తెలిపారు. తండ్రి భోజనానికి వెళ్లిన టైమ్ లో తాను అరటిపండ్లు అమ్మేవాడినని మారుతి చెప్పుకొచ్చారు. ఆ తరువాత తాను ఆఫీస్ బాయ్ గా కూడా చేశానని తాను మనుషుల మనస్తత్వాన్ని చూడగలగడంతో పాటు చదవగలిగానని మారుతి తెలిపారు.
తాను అరటిపండ్లు అమ్మడాన్ని కూడా ఇష్టంగా చేశానని డైరెక్టర్ గా తెరకెక్కించే ప్రతి సినిమాను మొదటి సినిమాగా భావిస్తాను కాబట్టే తాను డైరెక్టర్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నానని మారుతి అన్నారు. థియేటర్ల దగ్గర ఉండే పోస్టర్లను చూసి తాను బొమ్మలు గీసేవాడినని మారుతి తన గురించి ఎవరికీ తెలియని విషయాలను చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో బన్నీ హీరోగా మారుతి ఒక సినిమాను తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
Most Recommended Video
బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?