ఆ దర్శకుడి దశ తిరిగింది!!!

ఒకప్పుడు 60వేలు పెట్టుబడి పెట్టండి సినిమా తీసి చూపిస్తా అంటూ తాను రాసుకున్న కధలను పట్టుకుని ఇండస్ట్రీ చుట్టూ తిరిగాడు ఒక దర్శకుడు. అయితే ఎన్నో రోజుల కృషి తరువాత తన టాలెంట్ కు తగ్గ గుర్తింపు వచ్చింది. “ఈరోజుల్లో” అంటూ ఒక బూతు సినిమాను తీసి యూత్ ను ఆకర్షించాడు దర్శకుడు మారుతి.

అయితే వరుసగా అలాంటి కధలనే రాసుకుంటూ సినిమాలు తీస్తున్న క్రమంలో తనపై వస్తున్న “ఏ” సర్టిఫికేట్ వార్తలకు సమాధానంగా భలే..భలే మగాడివోయ్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టడమే కాకుండా, మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు…ఇంతకీ ఇప్పుడు మారుతి కధ ఎందుకు అంటారా….అక్కడే ఉంది మ్యాటర్. సహజంగా ఇండస్ట్రీలో హీరోలే ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారు….అయితే ఆది ఒకప్పటి రోజులు, ఇప్పుడు రోజులు మారాయి..ఇప్పుడు డిజిటల్ పుణ్యమా అంటూ…ఎక్కువ మొత్తంలో సంపాదించుకునేందుకు ఎన్నో మార్గాలు వచ్చాయి. దాన్ని పక్కా ప్లాన్ తో క్యాష్ చేస్కుంటున్నాడు దర్శకుడు మారుతి…ఒకవైపు డైరెక్టర్ గా పనిచేస్తూనే మరోవైపు చిన్న చిత్రాలను నిర్మిస్తున్నాడు.

అలాగే చిన్న చిత్రాలకి డిస్ట్రిబ్యూటర్ గానూ చేస్తున్నాడు. ఇలా ఒక సంవత్సర సమయంలో దర్శకుడు మారుతి సంపాదించేది…హీరో మహేష్ బాబు కంటే ఎక్కువే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఈ మూవీతో పాటు మరో  నాలుగు చిత్రాల్లో పెట్టుబడులు పెట్టారని అంటున్నారు. అలాగే కొన్ని చిత్రాలకి డిస్ట్రిబ్యూటర్ గానూ చేస్తున్నారు. ఇక నిర్మాతగా, డిస్ట్రీబుటేర్ గా, దర్శకుడిగా దూసుకుపోతున్న మారుతి దశ తిరిగింది అంటున్నాయి సినీ సర్కిల్స్…దేనికైనా లక్ కూడా ఉండాలిగా…

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus