Maruthi: ‘ది రాజాసాబ్’ రేంజ్… మారుతికి అలా కలిసొస్తుందా..!

‘ఈ రోజుల్లో’ అనే చిన్న సినిమాతో దర్శకుడిగా మారిన మారుతి (Maruthi) .. ఒక్కసారిగా టాలీవుడ్ మొత్తం హాట్ టాపిక్ అయ్యాడు. రూ.60 లక్షల్లో సినిమా తీసి రూ.18 కోట్లు ప్రాఫిట్స్ అందించడంతో అతని రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ తర్వాత ‘బస్ స్టాప్’ ‘భలే భలే మగాడివోయ్’ (Bhale Bhale Magadivoy) వంటి సినిమాలతో టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి చేరాడు. కానీ ఇతనికి వెంటనే స్టార్స్ ఛాన్సులు ఇవ్వలేదు. శర్వానంద్ (Sharwanand), సాయి దుర్గ తేజ్ (సాయి ధరమ్ తేజ్) (Sai Dharam Tej),గోపీచంద్ (Gopichand) వంటి హీరోలతో సినిమాలు చేసి హిట్లు కొట్టినా, ‘గీతా’ కాంపౌండ్..కి చాలా దగ్గరగా ఉన్నా, ఇతనికి అల్లు అర్జున్ (Allu Arjun)  వంటి హీరోలు ఛాన్స్ ఇచ్చింది లేదు.

Maruthi

అయితే ప్రభాస్ తో (Prabhas) సినిమా చేసే ఛాన్స్ కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. రూ.30 కోట్ల బడ్జెట్ లో సినిమాలు చేసుకునే మారుతికి ‘ది రాజాసాబ్’ (The Rajasaab) రూపంలో రూ.300 కోట్ల ప్రాజెక్టు అప్పగించాడు ప్రభాస్. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇది పాన్ ఇండియా సినిమా. మారుతి అక్కడితో ఆగడం లేదు.. ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ ను అతను కూడా వాడేసుకోవాలని చూస్తున్నట్టు కనిపిస్తుంది. అదెలా అంటే.. మారుతి ఓ నిర్మాణ భాగస్వామిగా ‘త్రిభాణదారి బార్బరిక్’ అనే సినిమా రూపొందుతుంది.

ఈరోజు దీని టీజర్ రిలీజ్ అయ్యింది. ఇందులో సత్యరాజ్ తో పాటు ‘కె.జి.ఎఫ్’ (KGF) ఫేమ్ వశిష్ట సింహా (Vasishta N. Simha) వంటి పాన్ ఇండియా ఆర్టిస్టులు ఇందులో నటిస్తున్నారు. వశిష్ట సింహా మెయిన్ హీరోగా నటిస్తుండగా సత్యం రాజేష్ (Satyam Rajesh), సత్యరాజ్ (Satya Raj) లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.తమిళ కమెడియన్ వీటీవీ గణేష్ (VTV Ganesh) కూడా ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. సాధారణంగా మారుతి ఇమేజ్ ను బట్టి అయితే కేజీఎఫ్ బ్యాచ్ వంటి వాళ్ళు అతని సినిమాలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించరు.

కానీ ప్రభాస్ తో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు అనే బ్రాండ్ వల్ల.. పాన్ ఇండియా స్టార్స్ అతని సినిమాల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ‘బార్బరిక్’ మాత్రమే కాదు.. మారుతి నిర్మాణ భాగస్వామిగా మరిన్ని సినిమాలు రూపొందుతున్నాయట. వాటిలో కూడా పర భాషా నటీనటులు కనిపించబోతున్నారు అని ఇన్సైడ్ టాక్.

తన తండ్రి గురించి కుష్బూ మరోసారి సంచలన వ్యాఖ్యలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus