Director Maruthi, Prabhas: మారుతికి మరో స్టార్ హీరో ఛాన్స్ ఇచ్చారా?

  • March 17, 2022 / 07:22 PM IST

ఈ ఏడాది వార్తల్లో ఎక్కువగా నిలిచిన పేర్లలో దర్శకుడు మారుతి ఒకరనే సంగతి తెలిసిందే. ఇప్పటివరకు పరిమిత బడ్జెట్ లో సినిమాలు తీసిన మారుతి ప్రభాస్ తో భారీ బడ్జెట్ లో సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాకు మొదట రాజా డీలక్స్ అనే టైటిల్ వినిపించినా ఆ టైటిల్ ప్రభాస్ కోసం కాదని మరో హీరో కోసమని క్లారిటీ వచ్చింది. మారుతి ప్రభాస్ తో పాటు రవితేజతో కూడా ఒక సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.

Click Here To Watch Now

మారుతి రవితేజ సినిమా కోసం తయారు చేసిన స్క్రిప్ట్ కు రాజా డీలక్స్ అనే టైటిల్ ఫిక్స్ అయిందని సమాచారం. మారుతి ప్రభాస్ కోసం కొత్త కథను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం పక్కా కమర్షియల్ సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్న మారుతి ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో ఒక సినిమా, రవితేజతో మరో సినిమాను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. వరుస సినిమాలతో మారుతి కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.

వరుసగా స్టార్ హీరోలతో సినిమాలను తెరకెక్కిస్తున్న మారుతి ఈ సినిమాలతో విజయాలను అందుకుంటే స్టార్ డైరెక్టర్ స్టేటస్ ను సొంతం చేసుకోవడం ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫ్లాపుల్లో ఉన్న ఎంతోమంది హీరోలకు హిట్ ఇచ్చిన డైరెక్టర్ గా మారుతికి ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. మారుతి తర్వాత సినిమాలు కూడా విజయాలను అందుకుంటే ఈ దర్శకునికి క్రేజ్ మరింత పెరగడం గ్యారంటీ అని చెప్పవచ్చు. చాలామంది దర్శకులతో పోల్చి చూస్తే మారుతి పారితోషికం తక్కువ మొత్తం కావడం గమనార్హం.

చిన్న సినిమాలతో కెరీర్ ను మొదలుపెట్టిన మారుతి సినిమాసినిమాకు దర్శకునిగా తన స్థాయిని పెంచుకుంటున్నారు. ప్రభాస్ తో మారుతి ఎలాంటి కథను తెరకెక్కిస్తారో చూడాల్సి ఉంది. తక్కువ సమయంలోనే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని థియేటర్లలో విడుదలవుతుందని సమాచారం.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus