Merlapaka Gandhi: మేర్లపాక – మెగా హీరో… కొత్త సినిమా ఓకే అయిపోయిందా?

కొత్త సినిమాలు సెట్స్‌ మీద ఉండగానే… మరో సినిమా ఓకే చేయడం హీరోలకు అలవాటే. అయితే కొత్త సినిమా అనౌన్స్‌ చేయడం, స్టార్ట్‌ చేయడం… ఆ తర్వాత ఏం సంగతీ తేలకపోవడం లాంటివి ఈ మధ్య టాలీవుడ్‌లో చూస్తున్నాం. ఏమైందా అని అనుకుంటున్నప్పుడు… మరో సినిమా ఓకే అయింది అనే వార్త కూడా వస్తోంది. తాజాగా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్న హీరో వరుణ్‌ తేజ్‌ (Varun Tej). ఆయన సినిమా ఒకటి సెట్స్‌ మీద ఉంది. అయితే షూటింగ్‌ అవుతోందో లేదో తెలియడం లేదు. ఈలోపు మరో సినిమా ఓకే అయింది అంటున్నారు.

‘వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్‌’ (Venkatadri Express) , ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ (Express Raja) లాంటి హిట్లు ఇచ్చిన ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ కొత్త సినిమా ఉంటుంది అని చెబుతున్నారు. ‘కృష్ణార్జున యుద్ధం’ (Krishnarjuna Yudham) , ‘మ్యాస్ట్రో’ (Maestro) , ‘లైక్‌ షేర్‌ సబ్‌స్ర్కయిబ్‌’ (Like Share Subscribe) అంటూ ఆయన కొన్ని సినిమాలు చేసినా వర్కవుట్‌ కాలేదు. రెండేళ్లుగా ఎక్కడా కనిపించని ఆయన… వరుణ్‌తేజ్‌కు ఇటీవల ఓ కథ చెప్పి ఓకే చేయించుకున్నారు అని టాక్‌. త్వరలో సినిమా అనౌన్స్‌మెంట్‌ కూడా ఉంటుంది అంటున్నారు.

పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తారని, క్రైమ్‌, అడ్వైంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో ఈ సినిమా క‌థ న‌డుస్తుంద‌ని స‌మాచారం. బ‌డ్జెట్ భారీగానే అవ‌స‌రం అవుతుంద‌ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే వ‌రుణ్‌తేజ్ ‘ఆప‌రేష‌న్ వాలైంటైన్‌’ (Operation Valentine) సినిమా డిజాస్ట‌ర్‌ ఎఫెక్ట్‌తో ‘మ‌ట్కా’ (Matka) సినిమా షూటింగ్‌ హోల్డ్‌లో పడిందని ఆ మధ్య వార్తలొచ్చాయి. అయితే ఇటీవల సినిమా మళ్లీ మొదలైంది. దీంతో ఈ సమయంలో పాన్‌ ఇండియా పంచాయితీ అవసరమా అనే డౌట్‌ కూడా వస్తోంది.

అయితే మరి ఈ సినిమాకు నిర్మాతలు ఎవరు, ఎప్పుడు స్టార్ట్‌ అవుతుంది అనేది తెలియడం లేదు. ఉగాది సందర్భంగా ఈ సినిమా గురించి అప్‌డేట్స్‌ రావొచ్చు అంటున్నారు. మరి వరుస పరాజయాల తర్వాత ఈ ఇద్దరూ చేయబోతున్న ఈ ప్రాజెక్టు ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus