పవన్ డైరెక్టర్ కు హ్యాండ్ ఇచ్చిన హీరోయిన్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘ఖుషి’, ‘పులి’ వంటి చిత్రాల్ని తెరకెక్కించిన ఎస్.జె. సూర్య అందరికీ గుర్తుండే ఉంటాడు. తరువాత ఈయన మహేష్ తో ‘నాని’ చిత్రాన్ని తెరకెక్కించి .. అలాగే మహేష్ తో కలిసి ‘స్పైడర్’ చిత్రంలో విలన్ గా కూడా నటించాడు. ప్రస్తుతం ఎస్.జే సూర్య కోలీవుడ్ లో రాధామోహన్ డైరెక్ట్ చేస్తోన్న ఓ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియా భవానీ శంకర్ నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ సమయంలో సూర్య మరియు భవానీ శంకర్ ల మధ్య పరిచయం పెరిగిపోయిందని తెలుస్తుంది.

ఇక ఇదే క్రమంలో సెట్లోనే హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ కు సూర్య లవ్ ప్రపొజల్ చేసాడని కోలీవుడ్ మీడియా చెప్పుకొచ్చింది. అయితే హీరోయిన్ ప్రియా భవానీ షాక్ కు సూర్య ప్రపొజల్ ను రిజెక్ట్ చేసిందట. ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్ అవుతుంది. దీంతో సూర్య ఈ విషయం పై సీరియస్ గా స్పందించాడు. ‘కొంతమంది ఇడియెట్స్ కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను.. ప్రియా భవానీకి ఎటువంటి లవ్ ప్రపోజల్ చేయలేదు. మేము మంచి స్నేహితులం మాత్రమే.’ అంటూ చెప్పుకొచ్చాడు.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus