Prasanth Varma: మహేష్ మేనల్లుడి సినిమాకి భారీగా డిమాండ్ చేస్తున్న ప్రశాంత్ వర్మ !

పెద్ద డైరెక్టర్ పేరు కథ, స్క్రీన్ ప్లే వంటి విభాగాల్లో ఉంటే తమ సినిమాకు బాగా బిజినెస్ జరుగుతుంది అని భావించే వాళ్ళు టాలీవుడ్లో ఎక్కువ మందే ఉన్నారు. ‘కుమారి 21 ఎఫ్’ (Kumari 21F) ‘ఉప్పెన’ (Uppena) ‘విరూపాక్ష’ (Virupaksha) వంటి సినిమాలకి సుకుమార్ (Sukumar) బ్రాండ్ తోడవ్వడంతో ఆ సినిమాలకి బిజినెస్ బాగా జరిగింది. ఫలితాలు కూడా సుకుమార్ హిట్ సినిమాల రేంజ్లో వచ్చాయి. అంతకు ముందు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (Raghavendra Rao) గారి బ్రాండ్ ను కూడా రాజమౌళి (S. S. Rajamouli) వంటి కొంతమంది దర్శకులు వాడుకున్నారు.

Prasanth Varma

‘ప్రేమ కథా చిత్రం’ (Prema Katha Chitram) వంటి సినిమాలకు కూడా మారుతి (Maruthi Dasari) బ్రాండ్ పనికొచ్చింది. ఇలా ఆ డైరెక్టర్ల పేర్లు వాడుకున్నందుకు పారితోషికం కూడా గట్టిగానే ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రశాంత్ వర్మ  (Prasanth Varma)  కూడా తన బ్రాండ్ ని క్యాష్ చేసుకునే పనిలో పడ్డట్టు సమాచారం. ‘హనుమాన్’ (Hanu Man)  తో పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగిన ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం ‘జై హనుమాన్’ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. అలాగే బాలయ్య  (Balakrishna) తనయుడు మోక్షజ్ఞ (Nandamuri Mokshagnya)తో కూడా అతను సినిమా చేయాలి.

ఇలాంటి టైంలో కూడా పక్క సినిమాలకు ఫ్రీలాన్సర్ గా పనిచేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. మహేష్ బాబు  (Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా  (Ahok Galla) హీరోగా ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva)  అనే సినిమా రూపొందింది. ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల దీనికి దర్శకుడు. నవంబర్ 14 న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సినిమాకు రూ.25 కోట్లు బడ్జెట్ పెట్టారని సమాచారం. అయితే తన బ్రాండ్ వాడుకుంటున్నందుకు గాను ప్రశాంత్ వర్మ రూ.8 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని ఇన్సైడ్ టాక్.

వాస్తవానికి ‘హనుమాన్’ సినిమాకి కూడా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఇంత పారితోషికం తీసుకోలేదట. ‘దేవకీ నందన వాసుదేవా’ చిత్రానికి రూ.7 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగిందట. ఇలాంటి టైంలో ప్రశాంత్ వర్మే రూ.8 కోట్లు డిమాండ్ చేయడంతో .. నిర్మాత సైతం షాక్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

ఇండియన్‌ సినిమాలో వచ్చే రంజాన్‌ మామూలుగా ఉండదు.. ఎలాంటి సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus