Karan Johar: కరణ్ జోహార్ ప్రశ్న.. బాలయ్య రియాక్షన్ కు దిమ్మతిరిగింది!

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) , ఈ మధ్య ఐఫా అవార్డ్స్‌లో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ ప్రెస్టిజియస్ ఈవెంట్‌లో బాలయ్యకు గోల్డెన్ లెగసీ అవార్డు ఇవ్వడంతో పాటు, బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) అతడితో సరదాగా ర్యాపిడ్ ఫైర్ నిర్వహించాడు. కరణ్ అడిగిన ప్రశ్నలకు బాలయ్య సమాధానాలు, అలాగే ఆయన చూపిన స్పాంటేనియస్ హ్యూమర్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. “మీ కాంటెంపరరీ హీరోలైన చిరంజీవి  (Chiranjeevi) , నాగార్జున (Nagarjuna) , వెంకటేష్ (Venkatesh) లలో మీ ఫేవరెట్ ఎవరు?” అని కరణ్ అడగ్గా, బాలయ్య తడుముకోకుండా “సల్మాన్ ఖాన్ (Salman Khan)  , షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) , అమీర్ ఖాన్  (Aamir Khan) లలో మీ ఫేవరెట్ ఎవరు?” అంటూ ఎదురు ప్రశ్న వేశారు.

Karan Johar

బాలయ్య రియాక్షన్ తో అందరూ నవ్వు ఆపుకోలేకపోయారు. కరణ్‌కు షాక్ తగలడం ఖాయం అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. రానా, తేజ సజ్జా వంటి స్టార్లు కూడా బాలయ్య సెన్స్ ఆఫ్ హ్యూమర్ ను మెచ్చుకున్నారు. అంతే కాదు, “మీ అభిమానులు మీకు ఎందుకు భయపడతారు?” అని కరణ్ అడిగినప్పుడు, బాలయ్య తనదైన శైలిలో “వాళ్లంతా నన్ను ప్రేమిస్తారు, కానీ కొన్నిసార్లు కొంతమంది విసిగిస్తే, రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను,” అంటూ నవ్వులు పూయించారు.

కరణ్ జోహార్ (Karan Johar) అడిగిన ప్రతి ప్రశ్నకు బాలయ్య సరదాగా, అదే సమయంలో తనదైన శైలిలో సమాధానాలు ఇస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక సినిమాల విషయానికొస్తే, వరుస హిట్స్ తో జోష్ లో ఉన్న బాలయ్య ప్రస్తుతం NBK 109 సినిమా బాబీ (Bobby) డైరెక్షన్ లో చేస్తున్నారు. 2025 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది.

అలానే బోయపాటి శ్రీను (Boyapati Srinu)  దర్శకత్వంలో ‘అఖండ 2’  (Akhanda 2)  ప్రాజెక్ట్‌ ప్రారంభించారు. అందులో తన అభిమానులకు కొత్త అనుభూతి కలిగించనున్నారు. ఈ సందర్భంలో బాలయ్య స్టైల్ ర్యాపిడ్ ఫైర్ తో ఐఫా ఈవెంట్ మరింత ప్రత్యేకంగా నిలిచింది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

‘మట్కా’ కథ ఇదే.. సినిమా టీమ్‌ కథ చెప్పిందా? క్లారిటీ ఇచ్చిందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus