Salman Khan: సల్మాన్‌కు బెదిరింపుల వేళ.. నాటి వార్నింగ్‌ గురించి చెప్పిన మాజీ ప్రేయసి!

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ ఇప్పుడు చాలా డేంజర్‌లో ఉన్నాడు. ఆయన స్నేహితుడు బాబా సిద్ధిఖీని గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ఇటీవల చంపేసింది. ఈ నేపథ్యంలో సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) భద్రతను పెంచారు. ఆయన కూడా తనవైన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే తన షూటింగ్‌లకు గ్యాప్‌ ఇవ్వడం లేదు. పని పనే, భద్రత భద్రతే అనుకుంటున్నాడు. ఎందుకంటే సల్మాన్‌కు ఈ వార్నింగ్‌లు, భయాలు కొత్తేం కాదు. ఎన్నో ఏళ్లుగా సల్మాన్‌ ఖాన్‌కు ఇలాంటి బెదిరింపులు, హత్యాయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.

Salman Khan

అలా కొన్నేళ్ల క్రితం జరిగిన విషయాన్ని ఆయన మాజీ ప్రేయసి సోమీ అలీ తెలిపారు. అండర్ వరల్డ్ డాన్‌ దావుద్‌ ఇబ్రహీమ్‌ టీమ్‌ నుండి సల్మాన్‌ ఖాన్‌కు గతంలో బెదిరింపులు వచ్చాయని ఆమె ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో ఆమె వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి. తాను బాలీవుడ్‌లో పని చేసిన సమయంలో దావుద్‌ ఇబ్రహీం, చోటా షకీల్‌ గురించి నటీనటులు మాట్లాడుకోవడం విన్నానని, అయితే వారి పేర్లు చెప్పేవారు కాదని, కేవలం ‘అండర్‌ వరల్డ్‌’ అని పరోక్షంగా మాట్లాడేవారని సోమీ అలీ చెప్పింది.

సల్మాన్‌తో కొన్నేళ్లపాటు డేటింగ్‌లో ఉన్న సమయంలో తాము గెలాక్సీ నివాసంలో మూడేళ్లు కలిసి ఉన్నామని చెప్పిన ఆమె.. ఆ సమయంలోనే ఓసారి అండర్‌వరల్డ్‌ నుండి బెదిరింపు కాల్‌ వచ్చిందని చెప్పింది. ఎవరు ఫోన్‌ చేశారో తెలియదు కానీ, ‘సల్మాన్‌కు చెప్పు.. ఆయన ప్రియురాలిని మేం కిడ్నాప్‌ చేయనున్నాం’ అని ఆ కాల్‌లో చెప్పారు. ఆ మాటలు భయపెట్టాయి. వెంటనే సల్మాన్‌కు విషయం చెబితే కంగారుపడ్డారు. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడేలా చేశాడు. ఆ ఫోన్‌ చేసిన వ్యక్తి గురించి తెలుసుకుందామని ఎన్నోసార్లు ప్రయత్నించాను.

‘ఈ విషయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది’ అని అప్పుడు సల్మాన్‌ చెప్పాడని సోమీ తెలిపారు. సోమీ అలీ పాకిస్థానీ అమెరికన్‌ నటి. కొన్నేళ్ల క్రితం సల్మాన్‌ ఖాన్‌ – సోమీ అలీ ప్రధాన పాత్రల్లో ఓ చిత్రాన్ని ప్రకటించారు. సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే ఆగిపోయింది. ఆ తర్వాతే ఇద్దరి ప్రేమాయణం సాగింది. కానీ ఆ సినిమా ఎందుకు ఆగింది, బంధం ఎందుకు విడిపోయింది అనే విషయం మాత్రం తెలియదు.

సినిమా టీమ్‌ సీక్వెల్‌ అంటోంది… కానీ దర్శకులు వేరే ఆలోచన చేస్తున్నారుగా!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus