Prashanth Neel: ‘సలార్‌ 1’ ఓకే ఓకే.. కానీ ‘సలార్‌ 2’… ప్రశాంత్‌ నీల్‌ కామెంట్స్‌ వైరల్‌!

బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన సినిమాలో కూడా కొన్ని లూప్‌ హోల్స్‌ ఉంటాయి. సినిమాకు నప్పని సీన్స్‌, అవసరం లేన్స్‌, లింక్‌ లేని సీన్స్‌ చాలానే ఉంటాయి. ఇంకాస్త బాగా తీసి ఉంటే బాగుంటుంది అని అంటుంటారు. అలా చాలామంది సినీ గోయర్స్‌ ‘సలార్‌ 1’ (Salaar) సినిమా గురించి చాలా విషయాలు చెప్పారు. అయితే అప్పుడు కొంతమంది ‘సలార్‌’ ఫ్యాన్స్‌ హర్ట్‌ అయ్యారు. అయితే ఇప్పుడు తన సినిమా విషయంలో తానే సంతృప్తిగా లేను అని ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ (Prasanth Neel) చెప్పారు.

Prashanth Neel

‘బాహుబ‌లి’ (Baahubali) సినిమాల త‌ర్వాత వ‌రుస‌గా డిజాస్ట‌ర్లు అందుకున్న ప్ర‌భాస్‌ను (Prabhas)  తిరిగి హిట్‌ ట్రాక్‌ ఎక్కించిన సినిమా ‘స‌లార్’. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు అందుకుంది. అయితే ఈ వ‌సూళ్లు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌కు (Prashanth Neel) సంతృప్తిని ఇవ్వ‌లేద‌ట‌. ఈ సినిమా సాధించిన ఫ‌లితం మీద తాను అసంతృప్తిగానే ఉన్న‌ చెప్పారు. ‘స‌లార్’ సినిమా కోసం తాము ప‌డ్డ క‌ష్టాన్ని దృష్టిలో ఉంచుకుని చూస్తే ఈ సినిమా రిజ‌ల్ట్ విష‌యంలో కొంత నిరాశ చెందాన‌ని ప్ర‌శాంత్ తెలిపాడు.

సినిమా ఇంకా బాగా ఆడాల్సింద‌న్నాడు. ‘కేజీయఫ్ 2’ (KGF 2) సినిమా నుంచి బ‌య‌టికి వ‌చ్చి ‘స‌లార్’ సినిమా తీసే విష‌యంలో కొంత ఉదాసీనంగా ఉన్నానేమో అని కూడా ప్ర‌శాంత్ వ్యాఖ్యానించారు. అయితే ‘స‌లార్ 2’ విష‌యంలో అభిమానులు ఎంత‌మాత్రం నిరాశ చెందొద్దని భరోసా ఇచ్చారు. ‘సలార్‌ 2’ సినిమా స్క్రిప్టు విష‌యంలో క‌స‌ర‌త్తులు కొనసాగుతున్నాయని, ఆ సినిమాకు రైటింగ్ వేరే లెవెల్లో ఉంటుంద‌ని, కెరీర్ బెస్ట్ ఇచ్చే పనిలో ఉన్నానని చెప్పారాయన.

ఇక ‘సలార్: శౌర్యంగ పర్వం’ కోసం ప్రభాస్‌ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ సినిమా రావడానికి చాలా సమయమే పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే వచ్చే మార్చి నుండి తారక్‌ సినిమా పనిలో ప్రశాంత్‌ ఉంటారు. అదయ్యాకనే ‘సలార్‌ 2’ మొదలవుతుంది అని అంటున్నారు.

ఇటు అల్లు అర్జున్‌ – అటు రేవంత్‌ రెడ్డి.. చిరంజీవి మాట్లాడి తీరాల్సిందేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus