యాక్షన్ సినిమాలతో కెరీర్‌ను ప్రారంభించి.. ‘కేజీయఫ్’ సినిమాలతో పాన్ ఇండియా డైరక్టర్‌గా మారిపోయారు ప్రశాంత్ నీల్. తొలి పార్ట్ వచ్చిన తర్వాత టాలీవుడ్‌లో ఆయనకు వరుస అవకాశాలు వచ్చాయి. అందులో సెలక్టెడ్‌గా ఎంచుకుంటూ ముందుకెళ్తున్నారు ఆయన. అధికారికంగా ఆయన నుండి వచ్చిన సినిమాలు రెండే. ఒకటి ప్రభాస్ ‘సలార్’ అయితే.. రెండోది తారక్ సినిమా. అయితే గత కొన్ని రోజులుగా ఈ రెండు సినిమాల గురించి రకరకాల రూమర్లు వస్తున్నాయి. దీంతో అర్జెంట్‌గా ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది.
ప్రభాస్ ‘సలార్’ చాలా రోజుల క్రితమే మొదలైంది. షూట్ స్టార్ట్ చేసిన కొత్తల్లో ఒకసారి ఈ సినిమా ‘కేజీయఫ్’లో ఓ పాత్ర ఆధారంగానే ఉంటుందని వార్తలొచ్చాయి, ఆ తర్వాత రెండు పార్టులు ఉండొచ్చు అని వార్తలొచ్చాయి. వీటిలో దేనికీ క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు మరోసారి ఈ సినిమా గురించి పుకార్లు వస్తున్నాయి. టీమ్ ఇప్పటికే చెప్పినట్లుగా సెప్టెంబరులో వచ్చే సినిమా మొదటి పార్ట్ అని అంటున్నారు. దీంతో అదేంటి.. ఈ సినిమాకు రెండు పార్టులా అని అడుగుతున్నారు ఫ్యాన్స్. అంతేకాదు రెండు పార్టుల మధ్య పెద్దగా గ్యాప్ ఉండదు అని కూడా అంటున్నారు.
ఇక తారక్ సినిమా విషయంలోనూ ఇలాంటి పరిస్థితే. ఈ సినిమాను రెండు పార్టులుగా చేయాలని టీమ్ అనుకుంటోంది అంటూ రెండు రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సినిమాకు అనుకున్న ప్లాట్ ఏమంత చిన్నగా లేదని.. రెండు పార్టులు చేస్తేనే బెటర్ అని అనుకున్నారట. దీంతో ఈ విషయం కూడా ‘సలార్’లా డౌట్‌ఫుల్‌గా మారింది. అంతేకాదు ఈ సినిమా డిసెంబరులో స్టార్ట్ చేయకతప్పదు అని అంటున్నారట. ఈ రెండు విషయాలు కలిపితే.. అసలు ఈ సినిమాలు ఒక పార్ట్‌లో వస్తాయా, రెండు పార్టులో వస్తాయా అనే డౌట్ మొదలైంది.
దీంతో ఈ విషయంలో ప్రశాంత్ నీల్ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియాలో ఏమైనా ఆన్సర్ ఇస్తారా అనుకుంటే ట్విటర్ నుండి ప్రశాంత్ నీల్ ఇటీవల బయటకు వచ్చేశారు. ఎందుకో తెలియదు కానీ ట్విటర్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసేశారు. కాబట్టి ఆయన బయట ఎక్కడైనా కనిపించి చెప్పాలి. లేదంటే నిర్మాతలే చెప్పాలి.
రైటర్ పద్మభూషణ్ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!
మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!