స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్ల నుండి దర్శకులు రాజ్ అండ్ డీకే..ల్లో.. రాజ్ తో డేటింగ్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అందుకే హైదరాబాద్ నుండి ఆమె ముంబైకి మకాం మార్చినట్టు కూడా టాక్ నడుస్తుంది. ‘ది ఫ్యామిలీ మెన్’ ‘ఫర్జి’ ‘గన్స్ అండ్ గులాబ్స్’ వంటి వెబ్ సిరీస్..లతో రాజ్ బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే రాజ్ కు ఇదివరకే శ్యామల అనే ఆమెను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
2015 లో వీరి వివాహం జరిగింది. అయితే కొన్నాళ్లుగా వీరు కూడా దూరంగా ఉంటున్నారని, వీరి మధ్య కూడా మనస్పర్థలు వచ్చినట్టు టాక్ నడించింది. ఇక సమంత కూడా నాగ చైతన్యతో (Naga Chaitanya) విడాకులు తీసుకోవడానికి ‘ది ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సిరీస్ కారణం అనే వాదన కూడా ఉంది. ఫైనల్ గా సమంత.. రాజ్ ను వివాహం చేసుకోవడం ఖాయమని అంతా అనుకుంటున్నారు.
తాజాగా వీరి డేటింగ్ రూమర్స్ ను ఉద్దేశించి అనుకుంట.. రాజ్ భార్య శ్యామల తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. అది ఇప్పుడు వైరల్ అవుతుంది. ‘నా కోసం ఆలోచించేవారు, వినేవారు, వినిపించేవారు, రాసేవారు, చదివేవారు ఉన్నారు. వాళ్ళని నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నా బ్లెస్సింగ్స్ ఇస్తూనే ఉంటాను’ అంటూ ఆమె రాసుకొచ్చింది. పరోక్షంగా శ్యామల…. రాజ్- సమంత..ల రిలేషన్ గురించే పరోక్షంగా ఏదో రాసుకొచ్చింది. దానిని ఇప్పుడు నెటిజన్లు, సమంత అభిమానులు డీకోడ్ చేసే పనిలో పడ్డారు.