RGV, Jr NTR: ఎన్టీఆర్ మాత్రమే మగాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన వర్మ!

స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో ఘనంగా జరిగాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ విజయవాడలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను చేస్తూ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే విజయవాడలో ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్టు, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో భాగంగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో ఈయన (RGV) మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో పాల్గొనడానికి రాలేదని ఒక జోక్ చెప్పడానికి వచ్చాను అంటూ కామెంట్ చేశారు.ఈ జోక్ వింటే ఎవ్వరికి నవ్వు కూడా రాదని అయితే ఈ జోక్ విన్న తర్వాత స్వర్గంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ గారికి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదని ఈయన కామెంట్ చేశారు. చంద్రబాబు క్యారెక్టర్ ఎలాంటిది అనేది ఎన్టీఆర్ ఆనాడే చెప్పారు. లక్ష్మి పార్వతి మాయలో ఎన్టీఆర్ పడ్డారని కొందరు అంటున్నారు.

ముఖ్యమంత్రిగా చేసిన ఆ మహా వ్యక్తికి అవగాహన లేదా? అవగాహన లేని వ్యక్తిని ఎందుకు మనం పూజిస్తే ఆయనకు దండలు వేస్తూ ఉన్నామని ప్రశ్నించారు.ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ గారు సైతం అక్కడి నుంచి వచ్చి చంద్రబాబునాయుడు పక్కనే కూర్చుని ఆయనని పొగిడారు. ఇలా రజనీకాంత్ చంద్రబాబు నాయుడుని పొగడారు అంటే ఒకరకంగా ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచినట్లేనని వర్మ వ్యాఖ్యానించారు.

ఎవరి మాయలో ఎవరు పడతారనేది కాంప్లికేటెడ్ క్వశ్చన్ గా మారిపోయింది. ఇక మొత్తానికి నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే మగాడు అని ఈయన కామెంట్ చేశారు.వారందరితో కలిసి ఎన్టీఆర్ వేదిక పంచుకోకుండా అక్కడికి వెళ్లకుండా ఉన్నారు అందుకు గల కారణం ఈయన సీనియర్ ఎన్టీఆర్ పై ఉన్న ఒక విపరీతమైన గౌరవంతో ఒక విధానానికి కట్టుబడి ఉన్నారు అంటూ వర్మ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus