2020లో చాలా దరిద్రాలు చూసాం. దాదాపు 8 నెలలు ఇంట్లోనే ఇరుక్కుపోయాం. కొందరు ఈ లాక్ డౌన్ ను ఎంజాయ్ చేసారు, చాలామంది బాధపడ్డారు. కానీ.. లాక్ డౌన్ ను కూడా సినిమా కోసం యుటిలైజ్ చేసుకున్న ఏకైక వ్యక్తి రాంగోపాల్ వర్మ. ఈ లాక్ డౌన్ టైంలోనే రెండు సినిమాలు షూటింగ్ చేసి రిలీజ్ కూడా చేసేసాడు. ఇక నిజ జీవిత సంఘటనల ఆధారంగా వర్మ తీసిన సినిమాలు వరుసబెట్టి రిలీజ్ అవుతూనే ఉన్నాయి.
కరోనా వైరస్, మర్డర్ అని ఒక నెల గ్యాప్ లో రెండు సినిమాలు రిలీజ్ చేసేసాడు వర్మ. ఆ సినిమాలు జనాలకి నచ్చాయ, వాళ్ళు వాటిని థియేటర్లలో చూసారా లేదా అనేది వేరే విషయం అనుకోండి. అయితే.. ఆల్రెడీ వర్మ నటుడిగా “పవర్ స్టార్” అనే ఇండిపెండెట్ ఫిలింతో తన పైత్యాన్ని చూపించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పూర్తిస్థాయి హీరోగా తెరంగేట్రం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు వర్మ. ఆల్రెడీ తన బయోపిక్ ను తానే నిర్మిస్తున్న వర్మ..
తన అసిస్టెంట్స్ లో ఒక కొత్త మెంబర్ కి తాను హీరోగా తెరకెక్కే సినిమాకి దర్శకత్వం వహించే బాధ్యత అందించాడట. మరి ఈ దురదృష్టాన్ని, సారీ అదృష్టాన్ని దక్కించుకున్న సదరు దర్శకుడి భవిష్యత్ ఏమిటో చూడాలి. ఆల్రెడీ 2020కి తన పైత్యంతో ట్రైలర్ చూపించిన వర్మ, ఇప్పుడు 2021లో ఏకంగా సినిమా చూపించడానికి రెడీ అయిపోతున్నాడన్నమాట. సో, డియర్ జనులారా గెట్ రెడీ!