కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరిగిపోయింది. వైరస్ బారిన పడ్డ చాలా మంది మరణిస్తున్నారు. శుక్రవారం నాడు ఒక్కరోజే దేశం మొత్తంగా రికార్డు స్థాయిలో 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. చాలా ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు లేక, ఆక్సిజన్ దొరక్క ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ఎవరిని వాళ్లు రక్షించుకోవడమే పరిష్కారమని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకూడదని.. ఒకవేళ వచ్చినా కూడా మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచిస్తున్నాయి.
వైద్యులు, అధికారులు ఎవరెన్ని జాగ్రత్తలు చెబుతున్నా కూడా కొందరు మాత్రం ఇష్టమొచ్చినట్లుగా తిరుగుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లు లేకుండా తిరగడం, భౌతిక దూరం పాటించకపోవడం వంటివి చేస్తూ వైరస్ వ్యాప్తిని మరింత పెంచుతున్నారు. అలాంటి వారికి అవగాహన కల్పించడం కోసం కొందరు సెలబ్రిటీలు తమవంతు కృషి చేస్తున్నారు. తాజాగా దర్శకుడు రవిబాబు తన అభిమానులకు ఓ సూచన చేశారు. ప్రతి ఒక్కరూ దయచేసి మాస్క్ ధరించాలంటూ ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.
చేతులు జోడిస్తూ రవిబాబు వీడియోలో మాట్లాడారు. దయచేసి అందరూ మాస్క్ వేసుకోవాలని.. మాస్క్ ఒక్కటే మనల్ని కాపాడుతుందని.. ఈ ఆక్సిజన్ అంతా కూడా హాస్పిటల్ లో చేరిన తరువాతే అవసరం ఉంటాయని.. అంతవరకు రాకుండా మనల్ని మనమే కాపాడుకోవాలని చెప్పారు. ముందు ఒక మాస్క్ వేసుకోవాలని చెప్పారు.. ఇప్పుడు రెండు అంటున్నారు.. త్వరలో మూడ్నాలుగు కూడా వేసుకోవాలని చెప్పొచ్చని అన్నారు. మాస్క్ వేసుకొని మనల్ని మనం మూసుకోకపోతే.. రేపు మనల్ని దుప్పటేసి మూసేస్తారని చెప్పారు. మిగతా వాళ్ల కోసం కాదు.. మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం మాస్క్ వేసుకోండి అంటూ వేడుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Most Recommended Video
ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!