ఒకప్పుడు హీరోయిన్లు గ్లామర్ షో చేయడానికి ఎక్కువగా ఇష్టపడేవారు కాదు. శ్రీదేవి గ్లామర్ షో చేసి స్టార్ స్టేటస్ ను దక్కించుకున్న టైంలో.. మిగిలిన హీరోయిన్లు కూడా గ్లామర్ షో చేయడానికి ముందడుగు వేసేవారు. అది కూడా వారు డ్రెస్సులు అవి మార్చుకోవడానికి క్యార్ వెన్ సదుపాయాలు లేకపోవడం వల్ల చెట్లు వెనుక, వాహనాల వెనుక నిలబడి డ్రెస్ చేంజ్ చేసుకునేవారు. ఇక గ్లామర్ సన్నివేశాలు తీసే స్థలం కుడా ప్రైవేటు గా ఉండాలని వారు కోరేవారు.
ఇప్పుడైతే అలాంటి అభ్యంతరాలు వ్యక్తమవ్వడం లేదు. గతంలో అయితే గ్లామర్ సన్నివేశాల్లో నటించకపోతే సినిమా నుండి తీసేస్తాము అంటూ దర్శకనిర్మాతలు బెదిరించేవారట. హీరోయిన్ మాధురీ దీక్షిత్ విషయంలో ఇది జరిగింది. అమితాబ్ బచ్చన్ హీరోగా టిన్ను ఆనంద్ దర్శకత్వంలో 1989లో వచ్చిన ‘షనాక్త్’ కోసం మాధురి దీక్షిత్ ఓ సన్నివేశంలో కేవలం బ్రాలో కనిపించాల్సి ఉందట.ఆ సన్నివేశం కోసం నచ్చినట్టు బ్రా తయారుచేయించుకోమని మాధురి దీక్షిత్ తో చెప్పాడట (Director) దర్శకుడు.
కానీ ఎన్నిసార్లు అడిగినా మాధురి దీక్షిత్ ఒప్పుకోలేదట. దీంతో ఈ సినిమాకి గుడ్ బై చెప్పేయాలని అతను కోరాడట. అమితాబ్ స్వయంగా వదిలేయండి అని రిక్వెస్ట్ చేసినా దర్శకుడు కన్విన్స్ అవ్వలేదట.దీంతో వేరే హీరోయిన్ కోసం సంప్రదింపులు జరపడం మొదలుపెట్టాడట దర్శకుడు టిన్ను ఆనంద్. ఈ విషయం తెలుసుకుని మాధురి దీక్షిత్ భయపడిపోయి.. వెంటనే బ్రా వేసుకుని ఆ సన్నివేశంలో నటించడానికి రెడీ అయిపోయిందట.