స్టార్ దర్శకులు నిర్మాతలుగా మారి తమ శిష్యులను డైరెక్టర్లను చేస్తుండటం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో ‘తమ బ్రాండ్ ఎక్కడా దెబ్బ తినకూడదు’ అనే ఉద్దేశంతో… స్క్రిప్ట్ వర్క్ లో ఎక్కువగా జోక్యం చేసుకుంటూ ఉంటారు. సినిమా బాగా వస్తుంది అని భావిస్తే స్క్రీన్ ప్లే విభాగంలో తమ పేరు కూడా వేసుకుంటారు. ఒకవేళ తాము అనుకున్నట్టు.. ఫలితం కూడా అనుకున్నట్టుగా వస్తే.. అంటే సినిమా హిట్ అయితే ఎక్కువ క్రెడిట్ స్టార్ దర్శకుల అకౌంట్లోనే పడుతుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ లో మహేష్ బాబు చెప్పినట్టు అనమాట.
ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే… కోవిడ్ టైంలో ‘ఓదెల రైల్వే స్టేషన్'(Odela Railway Station) అనే సినిమా వచ్చింది.ఆ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. దానికి సంపత్ నంది (Sampath Nandi) రైటర్ గా పేరు వేసుకున్నాడు. సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘ఆహా’ వారికి వ్యూయర్షిప్ కూడా బాగా వచ్చింది. కానీ ఆ సినిమాని జనాలు ఎక్కవగా గుర్తుపెట్టుకోలేదు. దానికి సీక్వెల్ గా ‘ఓదెల 2’ (Odela 2) వస్తుంది అని తెలిసినా ‘ఓదెల రైల్వే స్టేషన్’ గురించి పెద్దగా చర్చలు ఏమీ జరగలేదు. కానీ ఎప్పుడైతే ‘ఓదెల 2’ గ్లింప్స్ వచ్చిందో.
అక్కడి నుండి అందరిలోనూ ఆసక్తి పెరిగింది. తమన్నా (Tamannaah Bhatia) ఇందులో అతి కీలక పాత్ర పోషించడం, ముఖ్యంగా ఆమె ఇమేజ్ కి భిన్నమైన పాత్ర చేస్తుండటం, అలాగే హారర్ జోనర్లో ఈ కథ ఉంటుంది అనే అంశాలు రివీల్ అవ్వడం వల్ల ‘ఓదెల 2’ పై అంచనాలు పెరిగాయి. అయితే మొదటి పార్ట్ కి కథ అందించడం, ప్రమోషన్స్ చేయడం తప్ప దర్శకుడు సంపత్ నంది ఏమీ చేయలేదు. కానీ సెకండ్ పార్ట్ విషయంలో అతని ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ తమన్నాని తీసుకోవడం వల్ల సంపత్ కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చిందట.
ఈరోజు జరిగిన మీడియా ఇంటరాక్షన్లో స్వయంగా సంపత్ నంది ఈ విషయంపై ఓపెన్ గా స్పందించడం జరిగింది. అయితే టీజర్ కి జస్ట్ ‘క్రియేటెడ్ బై’ అనే విభాగంలోనే తన పేరు వేసుకున్న సంపత్ నంది, దానికి పాజిటివ్ రెస్పాన్స్ రావడం… బిజినెస్ బాగా జరగడంతో ‘స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ , డైరెక్షన్ సూపర్ విజన్’ అంటూ 4 రకాల కేటగిరీల్లో తన పేరు వేసేసుకున్నాడు. సో ఇప్పుడు ‘ఓదెల 2’ సక్సెస్ క్రెడిట్ ఎక్కువగా సంపత్ నంది తీసుకోవాలని ఆశపడుతున్నట్లు స్పష్టమవుతుంది.