ఇప్పుడు ప్రభాస్(Prabhas) సినిమాలు వస్తాయంటే అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సలార్ (Salaar) ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) తో వరుసగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టిన డార్లింగ్.. ఇప్పుడు తన దృష్టిని స్పిరిట్ సినిమాకు షిఫ్ట్ చేస్తున్నాడు. హిట్ ఫ్లాప్‌లు పక్కనపెట్టి, సినిమా ఎంటర్‌టైన్ చేస్తే చాలు అని ఫ్యాన్స్ అనుకుంటే, స్పిరిట్ (Spirit) మాత్రం ఇంకో లెవెల్‌లో ఉంటుందని చెప్పక తప్పదు. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక్కో అప్డేట్ గట్టిగా వినిపిస్తూనే ఉంటుంది.
ఎప్పుడు షూటింగ్ మొదలవుతుంది? ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందో? అన్న క్వశ్చన్స్ ఫ్యాన్స్‌లో అటు గూగుల్‌లోనూ ట్రెండింగ్‌లో ఉన్నాయి. వంగా అంటే మాస్ ఎమోషన్, వైల్డ్ స్క్రీన్‌ప్రెజెన్స్, బ్రూటల్ యాక్షన్ కచ్చితంగా ఉంటాయి. అర్జున్ రెడ్డి (Arjun Reddy) ‘యానిమల్’ (Animal)లో హీరో పాత్రల్ని ఎలా డిజైన్ చేశాడో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే స్టైల్‌లో మరింత హై లెవెల్ ఎలివేషన్‌తో ప్రభాస్‌ను చూపించబోతున్నాడట.
ప్రభాస్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడనే టాక్ ఉంది. కానీ, ఇది కచ్చితంగా మామూలు పోలీస్ స్టోరీ కాదని, అండర్ వరల్డ్ గ్యాంగ్‌లను నేలమట్టం చేసే ఓ పవర్‌ఫుల్ లీడర్ పాత్ర అని అంటున్నారు. అందుకే ప్రభాస్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడట. సలార్ లాంటి మాస్ లుక్ కాదు, మరింత స్టైలిష్, యథావిధి కాకుండా చూపించడానికే వంగా ఈసారి డిజైన్ చేసాడని ఫిల్మ్‌నగర్ లో చర్చ సాగుతోంది.
రాజాసాబ్ (The Raja saab), ఫౌజీ సినిమాల కంటే కూడా స్పిరిట్ సినిమానే ప్రస్తుతం హాట్ టాపిక్. వీటితో పోలిస్తే స్పిరిట్‌కి బడ్జెట్ కూడా రెట్టింపు. భూషణ్ కుమార్ (Bhushan Kumar) నిర్మాణంలో ఈ సినిమా పాన్ వరల్డ్ రిలీజ్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం వంగా ప్రత్యేకంగా ప్రభాస్‌తో ఫిజిక్, లుక్ విషయంలో క్లోజ్‌గా వర్క్ చేస్తున్నాడట. ఇక రిలీజ్ విషయానికి వస్తే, స్పిరిట్ 2026 సమ్మర్‌కి థియేటర్లలో సందడి చేయనుందని అంటున్నారు.