Sandeep Reddy Vanga , Jr NTR: సందీప్ రెడ్డి వంగా- ఎన్టీఆర్.. ఊహించని కాంబో సెట్ అవుతుందా?

ఎన్టీఆర్ (Jr NTR)  ఇప్పుడు పాన్ ఇండియా హీరో. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యి చాలా ఏళ్ళు అయ్యింది. అలాంటి రేంజ్ ఉన్న వీరిద్దరూ కలిసి ఓ చోట కనిపించారు అంటే.. వీరి అభిమానుల్లో మాత్రమే కాదు.. యావత్ సినీ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు అదే జరుగుతుంది. విషయం ఏంటో తెలీదు.. కానీ సందీప్ రెడ్డి వంగా, ఎన్టీఆర్..లు కలిశారు. అందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Sandeep Reddy Vanga , Jr NTR

ముంబైలోని ఓ హోటల్లో వీరు కలిసినట్టు తెలుస్తుంది. ‘దేవర’ (Devara)  ట్రైలర్ రేపు అనగా సెప్టెంబర్ 10న తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయబోతున్నారు. ముఖ్యంగా ముంబైలో ‘దేవర’ టీం ఓ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎన్టీఆర్,దర్శకుడు కొరటాలతో (Koratala Siva) సహా చాలా మంది ముంబై చేరుకున్నారు అని తెలుస్తుంది. ఎన్టీఆర్ (Jr NTR) బస చేస్తున్న హోటల్ కి సందీప్ రెడ్డి వంగా వెళ్లి కలిశారు అని స్పష్టమవుతుంది.

కచ్చితంగా ఎన్టీఆర్ కి (Jr NTR) కథ చెప్పడానికే సందీప్ వెళ్లినట్టు అంతా చెప్పుకుంటున్నారు. కథ నచ్చడం వల్లనే.. వీరిద్దరూ కలిసున్న ఫోటోని ఇంటర్నెట్లోకి ఎన్టీఆర్ వదిలినట్టు అంతా భావిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ‘స్పిరిట్’ (Spirit) సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. తర్వాత ‘యానిమల్ పార్క్’ (Animal) ఉంటుందని చెప్పకనే చెప్పారు. అలాగే మధ్యలో అల్లు అర్జున్ తో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు.

ఆ రకంగా చూస్తే.. సందీప్ ఇప్పుడు అస్సలు ఖాళీగా లేరు అనే చెప్పాలి. ఇలాంటి బిజీ షెడ్యూల్ లో ఎన్టీఆర్ ని కలిసి కథ చెప్పారు అంటే.. సందీప్ చేయాల్సిన ఏదో ఒక సినిమా హోల్డ్ లో పడి ఉండాలి. ఏదేమైనా ఎన్టీఆర్ తో కనుక సందీప్ రెడ్డి వంగా సినిమా సెట్ చేసుకుంటే మాత్రం… అది అభిమానులతో పాటు అందరికీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనడంలో సందేహం లేదు.

రీరిలీజ్‌ ట్రెండ్‌.. ఆ సినిమాలో పాటలకు థియేటర్లు ఊగడం పక్కా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus