గర్వన్మెంట్ కి ఇన్కమ్ సోర్స్ అంటే ట్యాక్స్ రూపంలో వచ్చేదే మెయిన్ అని చాలా మంది చెబుతుంటారు. ప్రతి ఏడాది టాక్స్ ద్వారా గవర్నమెంట్ కి ఎక్కువ ఆదాయం సమకూరుతుంది. ఇలా చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదట. ఏడాదికి 7 లక్షలు సంపాదించే సామాన్యుల నుండే 30 శాతం వరకు టాక్స్ కట్టించుకుంటుంది ప్రభుత్వం. ఇది అందరికీ తెలిసిన సంగతే..! అలా సంపాదించే వాళ్ళు ఏడాదికి లక్షల రూపాయలు టాక్స్ చెల్లిస్తున్నట్టు లెక్క. మరోపక్క ఎక్కువ టాక్స్ పే చేసే వాళ్ళ లిస్ట్ ను గమనిస్తే…ఎక్కువ శాతం సినిమా, స్పోర్ట్స్ (Celebrities) రంగానికి చెందిన వారే ఉన్నారు.
ఇటీవల దర్శకుడు కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో తాను ఏడాదికి రూ.4 కోట్లు టాక్స్ చెల్లిస్తున్నట్టు చెప్పి వార్తల్లో నిలిచాడు. అతనితో పాటు 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను అత్యధిక పన్ను చెల్లించే స్టార్స్ (Celebrities) లిస్ట్ ను ఓ లుక్కేద్దాం పదండి :
1) షారుఖ్ ఖాన్ :
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను అత్యధికంగా రూ.92 కోట్లు టాక్స్ చెల్లించారట.
2) విజయ్ :
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay Thalapathy) సైతం 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.75 కోట్లు టాక్స్ చెల్లించినట్టు సమాచారం.
3) అమితాబ్ బచ్చన్ :
బిగ్ బి అమితాబ్ (Amitabh Bachchan) సైతం 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.71 కోట్లు ప్రభుత్వానికి టాక్స్ చెల్లించారట.
4) అజయ్ దేవగన్ :
బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అజయ్ దేవగన్ (Ajay Devgn) కూడా 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.42 కోట్లు ప్రభుత్వానికి పన్ను చెల్లించినట్టు తెలుస్తుంది.
5) రణబీర్ కపూర్ :
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) కూడా 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.36 కోట్లు టాక్స్ చెల్లించినట్టు స్పష్టమవుతుంది
6) హృతిక్ రోషన్ :
మరో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.28 కోట్లు టాక్స్ చెల్లించినట్టు సమాచారం.
7) కపిల్ శర్మ :
బాలీవుడ్ కమెడియన్ కపిల్ శర్మ (Kapil Sharma) కూడా 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.26 కోట్లు టాక్స్ చెల్లించాడట.
8) కరీనా కపూర్ :
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ (Kareena Kapoor) సైతం 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.20 కోట్లు టాక్స్ చెల్లిస్తున్నట్టు సమాచారం.
9) షాహిద్ కపూర్ :
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ (Shahid Kapoor) 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.14 కోట్లు టాక్స్ చెల్లించారు.
10) కియారా అద్వానీ :
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.12 కోట్లు టాక్స్ చెల్లించింది.
11) కత్రినా కైఫ్ :
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ (Katrina Kaif) సైతం 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.11 కోట్లు ట్యాక్స్ చెల్లించింది.
12) పంకజ్ త్రిపాఠి :
‘మిర్జాపూర్’ నటుడు పంకజ్ త్రిపాఠి (Pankaj Tripathi) సైతం 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.11 కోట్లు ట్యాక్స్ చెల్లించాడట.
13) ఆమిర్ ఖాన్ :
బాలీవుడ్ బడా స్టార్ హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan) 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.11 కోట్లు ట్యాక్స్ చెల్లించాడట.
14) మోహన్ లాల్ :
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal) సైతం 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.14 కోట్లు ట్యాక్స్ చెల్లించాడు.
15) అల్లు అర్జున్ :
టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ (Allu Arjun) కూడా 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.14 కోట్లు ట్యాక్స్ చెల్లించినట్టు తెలుస్తుంది.