Sekhar Kammula: తన బ్లాక్‌బస్టర్‌ సినిమాల సీక్వెల్స్‌.. శేఖర్‌ కమ్ముల ఏం చెప్పారంటే?

సినిమాల యందు శేఖర్‌ కమ్ముల  (Sekhar Kammula) సినిమాలు వేరయా! ఈ మాట వినడానికి రొటీన్‌గా ఉన్నా… ఆయన సినిమాలు ఎప్పుడూ రొటీన్‌ అనిపించలేదు. సినిమాల ఫలితం తేడా కొట్టి ఉండొచ్చు కానీ.. ఆయన పనితనం మీద ఎప్పుడూ ఎలాంటి విమర్శలు లేవు. దానికి కారణం ఆయన కథలు సగటు సమాజం నుండి పుట్టుకొచ్చేవే. అలా ఆయన చేసిన కొన్ని సినిమాలకు సీక్వెల్స్‌ వస్తాయని గత కొన్నేళ్లుగా వార్తలొస్తున్నాయి. అయితే ఏమైందో ఏమో మళ్లీ కొన్ని రోజులకే ఆ చర్చలు ఆగిపోతున్నాయి. వాటిలో ‘హ్యాపీడేస్‌’ (Happy Days) , ‘లీడర్‌’ (Leader)  సినిమాలున్నాయి. తాజాగా వీటి గురించి శేఖర్‌ కమ్ము మాట్లాడారు.

‘హ్యాపీడేస్‌’ తీసే సమయానికి తన కాలేజీ చదువులు పూర్తయ్యి పదేళ్లు దాటిపోయిందని, ఆ టైమ్‌లో ఈ కథ చేస్తే ప్రేక్షకులకు నచ్చుతుందా అని అనుకున్నారట ఆయన. సినిమాను అవుట్‌డేట్‌ అనుకుంటారా అనే డౌట్స్‌ కూడా వచ్చాయట. అయితే ఆ కథలోని స్నేహం, చదువులు, ఫ్యామిలీ ఎమోషన్స్‌ అలరించాయని ఫలితం వచ్చాక తెలిసిందన్నారు. ఇప్పటికీ ఆ సినిమా ఫీల్‌ సమాజంలో అలానే ఉందని, అయితే ఇప్పుడు సెల్‌ఫోన్లు, గ్యాడ్జెట్లు అందుబాటులోకి వచ్చాక విద్యార్థులంతా ఎవరి ప్రపంచంలో వాళ్లు ఉంటున్నారేమో అనిపిస్తోంది అని విశ్లేషించారు.

మరి ‘హ్యాపీడేస్ 2’ సంగతి ఏంటి అని అడిగితే… ఈ మధ్య ‘హ్యాపీడేస్‌’ చూశాక సీక్వెల్‌ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనైతే వచ్చిందని చెప్పారు. కానీ కథేమీ తట్టలేదని కుదిరినప్పుడు ఆ సంగతి చూడాలి అని చెప్పారాయన. ఇక భవిష్యత్తులో రాజకీయాలు ఎలా ఉంటాయన్న కోణంలో ‘లీడర్‌ 2’ సినిమా చేస్తానని తప్పకుండా చేస్తా. అది రానాతోనే ఉంటుంది అని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఓ పాయింట్‌ అనుకున్నామని, అది పూర్తి స్క్రిప్ట్‌గా సిద్ధమవ్వాలి అని చెప్పారు.

ఇక కొత్త సినిమా ‘కుబేర’ గురించి అడిగితే… పెద్ద భావజాలం గురించి మాట్లాడనున్న కథ ఆ సినిమా అని చెప్పారు. ఈ సినిమాలో గొప్ప ఫిలాసఫీ ఉంటుందని, ఈ కథకు నాగార్జున (Nagarjuna) , ధనుష్ (Dhanush) లాంటి స్టార్‌ హీరోలు చాలా అవసరమని చెప్పారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus