అలా చేయడం చాలా తప్పు అంటున్న ప్రముఖ నటి .. ఏం జరిగిందంటే?

సినిమా రంగం అంటే రంగుల ప్రపంచం అనే సంగతి తెలిసిందే. సినిమా రంగంలో సక్సెస్ సాధించాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. కొంతమందికి ఈ రంగంలో సులువుగానే అవకాశాలు వస్తే మరి కొందరు ఎంత ప్రయత్నించినా ఆఫర్లు రావడం కష్టమవుతోంది. ఈ రంగంలో ఎంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత లక్ కూడా ఉండాలని అప్పుడే సక్సెస్ సొంతమవుతుందని చాలామంది భావిస్తారు. బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న హిమజ (Himaja) తాజాగా సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తెలుగమ్మయిలు ఒకప్పుడు రిజర్వ్డ్ గా ఉండేవారని సినిమా ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఆఫర్లు వస్తాయని అనుకోవడం తప్పని ఆమె అన్నారు. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇచ్చిన వాళ్లందరికీ కూడా మూవీ ఆఫర్లు రావడం లేదని హిమజ పేర్కొన్నారు. ముంబై నుంచి వచ్చిన వాళ్లకు మాత్రం సినిమా ఇండస్ట్రీలో ఆఫర్లు ఇస్తారని వారిలో ఏం నచ్చిందో తెలియదని ఆమె తెలిపారు.

ఒక్కోసారి తెలుగమ్మాయిలు సైతం హీరోయిన్ రోల్ అయితే మాత్రమే చేస్తాం అనేవాళ్లు ఉన్నారని హిమజ పేర్కొన్నారు. అది చాలా తప్పని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి భవిష్యత్ ఉంటుందని హిమజ వెల్లడించడం గమనార్హం. నాకు మొదట పనిమనిషి రోల్ వచ్చిందని ఆ తర్వాత మంచి ఆఫర్లు వచ్చాయని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం నేను సంతోషంగానే ఉన్నానని హిమజ వెల్లడించారు.

సపోర్టింగ్ రోల్స్ తో హిమజ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదిగారు. హిమజ పారితోషికం ఒకింత భారీగానే ఉంది. హిమజను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా రాబోయే రోజుల్లో ఆమె కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. హిమజకు సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus