Shankar, KGF2: ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ చూసిన శంకర్ ఏమన్నారంటే..!

యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ చిత్రం విడుదలై నెల రోజులు దాటింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రికార్డ్ కలెక్షన్లను రాబట్టింది.కన్నడ లో మాత్రమే కాదు అన్ని భాషల్లోనూ పెట్టిన డబ్బులకు లాభాలు తెచ్చిపెట్టింది. ఇంకా చెప్పాలి అంటే ‘ఆర్.ఆర్.ఆర్’ కలెక్షన్లను కూడా అధిగమించింది. ముఖ్యంగా హిందీ బెల్ట్ లో ఆర్.ఆర్.ఆర్ ను పెద్ద మార్జిన్ తో కె.జి.ఎఫ్ చాప్టర్ 2 దాటేసింది.

దీంతో ప్రశాంత్ నీల్,యష్ లకు పాన్ ఇండియా వైడ్ స్టార్ ఇమేజ్ ఏర్పడింది. ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ ఫ్లూక్ హిట్ అనుకున్నవాళ్ళంతా ముక్కున వేలు వేసుకున్నారు. ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కొన్ని థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. అయితే అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ పే పర్ వ్యూ పద్దతిలో విడుదలైంది. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన తమిళ స్టార్ దర్శకుడు శంకర్.. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ మూవీ చాలా బాగుందని, స్టోరీ టెల్లింగ్ కూడా కొత్తగా అనిపించిందని, మాస్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ ఇదని ప్రశంసించిన శంకర్ హీరో యష్ ను పవర్ హౌస్ అంటూ కొనియాడారు. అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్ ను మాస్ సినిమాలకి పెద్ద దిక్కు అయినందుకు థాంక్స్ అంటూ ఆకాశానికి ఎత్తేసారు శంకర్. ప్రస్తుతం ఆయన రాంచరణ్ తో ఓ సినిమా చేస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న 50 వ చిత్రమిది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus