Raj Tarun: రాజ్ తరుణ్ పై ఆ దర్శకుడికి నమ్మకం లేదట..!

రాజ్ తరుణ్ నటించిన ‘స్టాండప్ రాహుల్’ చిత్రం ఈ శుక్రవారం అంటే మార్చి 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మధ్య కాలంలో రాజ్ తరుణ్ నటించిన సినిమాలు విజయాలు సాధించింది లేదు. దాంతో ఈ చిత్రం పై పెద్దగా బజ్ లేదు. కానీ టీజర్, ట్రైలర్స్ చూస్తుంటే కొంత ప్రామిసింగ్ గా అనిపిస్తున్నాయి. రాజ్ తరుణ్ లుక్స్ కూడా కాస్త డిఫరెంట్ అదే విధంగా ట్రెండీగా అనిపిస్తున్నాయి.స్టాండప్ కమెడియన్ గా అతను ఈ చిత్రంలో కనిపిస్తున్నాడు. వర్ష బొల్లమ హీరోయిన్ గా నటించింది. ఈమె ఉందంటే సినిమా మినిమమ్ గ్యారెంటీ అంటుంటారు కొంతమంది ఇండస్ట్రీ జనాలు.

Click Here To Watch Now

ఈ చిత్రానికి వచ్చేసరికి పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. రాజ్ తరుణ్ గట్టెక్కితే ఈ చిత్రంతోనే గట్టెక్కాలి అంటూ ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉండగా… ఈ చిత్రం దర్శకుడు శాంటో మోహన్ వీరంకి దర్శకుడు రాజ్ తరుణ్ ను ఆడిషన్ చేసాడట. ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్ అయిన రాజ్ తరుణ్ ను ఆడిషన్ చేయడం ఏంటి అనే డౌట్ అందరికీ రావచ్చు. ఈ విషయం పై రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. “ద‌ర్శ‌కుడు శాంటో నాకు 4 గంట‌ల‌ పాటు ఈ కథ చెప్పాడు. చాలా డిటైల్‌డ్ గా వివ‌రించాడు.

వెంట‌నే మ‌రునిముషంలో చేస్తానని చెప్పాను. కానీ నాపై ఆయ‌న‌కు న‌మ్మ‌కం క‌ల‌గ‌లేదు. నేను చేస్తాన‌న్నానుగ‌దా! అని అంటే, కాదు. ఆడిష‌న్ కావాలి అన్నాడు. అలా ఆడిష‌న్ చేశాక ఆయ‌న‌కి నాపై న‌మ్మ‌కం ఏర్ప‌డింది. ఇది మా రెండేళ్ళ జ‌ర్నీ. స్టాండప్ రాహుల్ అంటే ఎంటర్టైన్ చేసే కామెడీతో పాటు ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది. పూజాహెగ్డే ఇటీవల ఓ సినిమాలో చేసింది. అది మాకు హెల్ప్ అవుతుంద‌ని అనుకుంటున్నాను. దానికి మించిన కామెడీ మా సినిమాలో ఉంటుంది.ఎమోష‌న్స్ కూడా సమపాళ్లలో ఉంటాయి. ఈ సినిమా నా కెరీర్‌కు బాగా ఉపయోగపడుతుంది.

వ‌ర్ష పాత్ర చాలా క్యూట్‌ గా వుంటుంది. ఆమెకు కొన్ని అభిప్రాయాలుంటాయి. వాటిని బాలన్స్ చేస్తూ, నా కుటుంబాన్ని కూడా చూసుకుంటూ స్టాండప్ కామెడీ ఎలా చేశాన‌నేది ఇందులో ద‌ర్శ‌కుడు బాగా డీల్ చేశారు. ఇటువంటి సినిమా ఇంత‌కుముందు రాలేదు. చిత్ర నిర్మాత‌లు క‌రోనా వ‌చ్చి మ‌ధ్య‌లో ఆగిపోయినా చాలా న‌మ్మ‌కంతో ఈ సినిమాకు ఎంత‌మేర‌కు కావాలో అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించారు. ద‌ర్శ‌కుడికి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుంద‌ని న‌మ్మ‌క‌ముంది” అంటూ అతను చెప్పుకొచ్చాడు. వరుస ప్లాపుల్లో ఉంటే కొత్త డైరెక్టర్లు అయినా ఏమి చెబితే అది చెయ్యాలన్న మాట.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus