సహజంగా ఇండస్ట్రీలో అటు హీరోలకు, దర్శకులకు, మంచి పేరు ఉంటుంది. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా వల్ల కరియర్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. అయితే హీరోగానో, లేకపోతే దర్శకుడిగానో అవకాశం వస్తే ఎవ్వరైనా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఎలా అయిన టాప్ స్థానంలో ఉండాలి అని అనుకుంటారు. అయితే అలాంటి అవకాన్ని దక్కించుకుని అతి తక్కువ సమయంలోనే, చాలా తక్కువ సినిమాలతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు మన తమిళ దర్శకుడు ఎస్.జె సూర్య.
ఇంతవరకూ బాగానే ఉన్నా, అందరూ నడిచే దారిలో తాను నడవను అంటున్నాడు సూర్య…అందుకే ఒక విచిత్రమైన నిర్ణయాన్ని తీసుకున్నాడని, ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటి ఆ విచిత్రమైన నిర్ణయం అంటే…దర్శకుడిగా టాప్ పొసిషన్ లో ఉన్న సూర్య స్టార్ హీరోలని డైరెక్టర్ చేయటం మానేసి, నటించటం మొదలు పెడుతున్నాడు…అదేంటి అంటే…తనకు నటుడుగా వచ్చే పాపులారిటీనే కోరుకుంటానని చబుతున్నాడు.
ఇదే క్రమంలో సూర్య తెలుగులో రెండు చిత్రాలు, తమిళ్ లో నాలుగు చిత్రాలు వరకూ చేస్తున్నట్లు సమాచారం. ఇక తెలుగులో మన ప్రిన్స్ మురుగుదాస్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో విలన్ పాత్రలో సూర్య మెరవనున్నాడు అని ఇప్పటికే బయటకు వచ్చింది ఏది ఏమైనా…దర్శకుడిగా మంచి అవకాశం ఉన్న సూర్య ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోవడం కోసం తన కరియర్ ను పాడుచేసుకోవడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే… చూద్దాం మరి ఏం జరుగుతుందో.