Manchu Manoj:మనోజ్ అహం బ్రహ్మాస్మి ఇక లేనట్టేనా?

మంచు మనోజ్ హీరోగా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన తన వ్యక్తిగత కారణాలు వల్ల కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు అయితే ఇప్పుడిప్పుడే సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు. ఇలా మంచు మనోజ్ గత కొద్ది రోజుల క్రితం ప్రకటించినటువంటి సినిమాలలో అహం బ్రహ్మాస్మి ఒకటి.డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది అయితే ఈ సినిమా కొంత భాగం షూటింగ్ పనులను జరుపుకొని అనంతరం వాయిదా పడింది అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ తెలియలేదు దీంతో ఈ సినిమా అసలు ప్రేక్షకుల ముందుకు వస్తోందా లేదా అన్న సందేహాలు కూడా అందరిలోనూ ఉన్నాయి. తాజాగా ఈ సినిమా గురించి డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఆది కేశవ ఈ సినిమా నవంబర్ 10వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇందులో భాగంగా లీలమ్మో అనే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ కి అహం బ్రహ్మాస్మి సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అహం బ్రహ్మాస్మి సినిమా ప్రారంభించి ఎందుకు పక్కన పెట్టారు అసలు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందా అంటూ ఈయనను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు శ్రీకాంత్ సమాధానం చెబుతూ ఈ సినిమా పక్కన పెట్టడానికి కారణం మనోజ్ అన్న వ్యక్తిగత కారణాలేనని తెలిపారు. ఆయన(Manchu Manoj) వ్యక్తిగత కారణాల వల్ల సినిమా పక్కన పెట్టాల్సి వచ్చిందని అయితే ఈ ప్రాజెక్ట్ తప్పకుండా ప్రేక్షకుల ముందుకు వస్తుందంటూ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus