దుర్గ సినిమాకి చైతూ ఎందుకు నో చెప్పాడో అర్ధం కాలేదట

సగం షూటింగ్ పూర్తైన సినిమాలు ఆగిపోవడం, ఎనౌన్స్ మెంట్ తోనే సినిమాలు ఆగిపోవడం, పూజా కార్యక్రమాల అనంతరం సినిమాలు ఆగిపోవడం అనేవి చాలా కామన్. కొరటాల-రామ్ చరణ్ కాంబినేషన్ సినిమా రెండుసార్లు పూజా కార్యక్రమాల అనంతరం ఆగిపోయింది. కారణం ఏమిటి అనేది ఇప్పటికీ ఎవరికీ అర్ధం కానీ విషయం. ఆ కోవలో నాగచైతన్య కూడా ఒక సినిమాను ప్రారంభ దశలోనే ఆపేశాడు. అదే “దుర్గ” చిత్రం. హన్సిక కథానాయికగా శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మించాల్సి ఉంది. కానీ.. అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకొన్న రెండో రోజే సినిమా ఆగిపోయిందని తెలిసింది.

అప్పట్నుంచి శ్రీనివాస్ రెడ్డి మరో సినిమా దొరకడానికి చాలా టైమ్ పట్టింది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన “రాగాల 24 గంటల్లో” వచ్చే శుక్రవారం విడుదలవుతోంది. సత్యదేవ్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఈ చిత్రం విడుదల సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నాగచైతన్య ఆ సినిమా ఎందుకు వద్దన్నాడో.. ఉన్నపళంగా ఎందుకు ఆపేశాడో నాకు ఇప్పటికీ అర్ధం కాలేదు” అని చెప్పుకొచ్చాడు.

తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus