ఆ స్టార్ డైరెక్టర్లిద్దరికీ ఒకే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారట..!

  • July 5, 2020 / 12:30 PM IST

అదేంటో కానీ ఇద్దరు స్టార్ డైరెక్టర్లకు ఒకే ప్రాబ్లమ్ వచ్చి పడింది. వాళ్ళెవరో.. పైన హెడ్డింగ్ చూసినప్పుడే మీకు అర్ధమైపోయి ఉండచ్చు. ఒకరు ‘రంగస్థలం’ తో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టిన దర్శకుడు సుకుమార్ అయితే.. మరొకరు ‘గీత గోవిందం’ చిత్రంతో అత్యధిక లాభాల్ని అందించిన దర్శకుడు పరశురాం(బుజ్జి). విచిత్రం ఏమిటంటే ఈ రెండు చిత్రాలు 2018లోనే విడుదలయ్యాయి. మరో విచిత్రం ఏమిటంటే ఈ దర్శకులు ఆ చిత్రాల తరువాత ఇప్పటి వరకూ మరో సినిమాని తెరకెక్కించకపోవడం.

నిజానికి ‘పుష్ప’ అనే కథని మహేష్ కోసం రెడీ చేసుకున్నాడు సుకుమార్. కానీ మహేష్ కు ఆ స్క్రిప్ట్ అంత నచ్చక పోవడంతో రిజెక్ట్ చేసాడు. దాంతో అల్లు అర్జున్ ను కలిసి ‘పుష్ప’ కథ వినిపించాడు సుకుమార్. బన్నీ వెంటనే ఓకే చెయ్యలేదు.సుకుమార్ తో కొన్ని మార్పులు చేయించిన తరువాత ఓకే చేసాడు. ఇక ‘గీత గోవిందం’ పరశురామ్ కూడా అల్లు అర్జున్ తో సినిమా చెయ్యాలి అని ‘సర్కారు వారి పాట’ కథని రెడీ చేసుకున్నాడు.

కానీ అల్లు అర్జున్ కు ఆ కథ నచ్చలేదు. ఈ క్రమంలో మహేష్ బాబుని కలిసి కథ వినిపించాడు. మహేష్ కూడా వెంటనే ఒప్పుకోలేదు.. కొన్ని మార్పులు చేయించిన తరువాతే ఓకే చెప్పాడు. అటు ‘పుష్ప’ ని.. ఇటు ‘సర్కారు వారి పాట’ ని.. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు నిర్మిస్తుండడం మరో కామన్ పాయింట్. అయితే రెండేళ్ల తరువాత సినిమాలు చెయ్యడానికి రెడీ అయిన దర్శకులు సుకుమార్, పరశురామ్ లకు.. ఇప్పుడు వైరస్ మహమ్మారి పెద్ద దెబ్బేసిందనే చెప్పాలి. ఈ సినిమాలు పూర్తయ్యి విడుదలవ్వడానికి మరో సంవత్సరమైనా టైం పడుతుంది. కాబట్టి వీరి సినిమాలు 3 ఏళ్ళ తరువాత విడుదలవుతాయన్న మాట.

Most Recommended Video

భానుమతి & రామకృష్ణ సినిమా రివ్యూ & రేటింగ్!
సినిమాల్లోకి రాకముందు మన హీరోయిన్స్ ఎలా ఉంటారో చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!
అట్టర్ ఫ్లాప్ సీజన్ అంటే ఇదేనేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus