Sukumar,Trivikram: పుష్ప2 ఇండస్ట్రీ హిట్టైతే అలా జరుగుతుందా?

  • November 1, 2022 / 03:38 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు ఎలాంటి సందేహం అవసరం లేకుండా రాజమౌళి పేరును సమాధానంగా చెబుతారనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం నంబర్2 పొజిషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నారు. మాటల మాంత్రికుడిగా పేరును సొంతం చేసుకున్న త్రివిక్రమ్ రచనా శైలికి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులలో ఎక్కువమంది ఫిదా అవుతున్నారు. త్రివిక్రమ్ సినిమాలు ఇతర డైరెక్టర్ల సినిమాలకు భిన్నంగా ఉంటాయి. అటు క్లాస్ ఇటు మాస్ ప్రేక్షకులకు నచ్చేలా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలను తెరకెక్కిస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

త్రివిక్రమ్ గత సినిమాలు అరవింద సమేత, అల వైకుంఠపురములో ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించాయి. అయితే పాన్ ఇండియా స్థాయిలో త్రివిక్రమ్ సినిమాలు సక్సెస్ అవుతాయా అనే ప్రశ్నకు మాత్రం కాదనే సమాధానం వినిపిస్తుందనే సంగతి తెలిసిందే. అయితే పుష్ప ది రైజ్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకున్న సుకుమార్ పుష్ప ది రూల్ సినిమాతో మరో ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకుంటే నంబర్2 స్థానంలో నిలుస్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

సుకుమార్ సైతం మరో ఇండస్ట్రీ హిట్ సాధించాలని నంబర్2 డైరెక్టర్ గా నిలవాలని భావిస్తున్నారు. ఆ స్థానానికి చేరిన తర్వాత రాజమౌళికి గట్టి పోటీ ఇవ్వాలని సుకుమార్ అనుకుంటున్నారు. రాజమౌళి చాలా సంవత్సరాల క్రితం సుకుమార్ మాస్ సినిమాలు తీస్తే ఊహించని రేంజ్ కు ఎదుగుతారని చెప్పగా ప్రస్తుతం సుకుమార్ మాస్ సినిమాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు సొంతం చేసుకుంటున్న సుకుమార్ తర్వాత ప్రాజెక్ట్ ల గురించి క్లారిటీ రావాల్సి ఉంది.

సుకుమార్ సినిమాలన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లుగా తెరకెక్కుతున్నాయి. సుకుమార్ పారితోషికం ప్రస్తుతం 25 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని తెలుస్తోంది. సినిమాసినిమాకు దర్శకునిగా సుకుమార్ రేంజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus