సుకుమార్ తర్వాత ప్లాన్ అదేనా..?

ఆర్య సీరిస్ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో చేస్తున్న సినిమా పుష్ప. ఇప్పుడు ఈ సినిమాకి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వస్తోంది. ఈ సినిమా గురించి ఎలాంటి న్యూస్ అయినా సరే ఇట్టే వైరల్ అయిపోతోంది. నిజానికి లాక్డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుపుకుంటోంది. ఆ డేట్స్ అన్నింటిని కవర్ చేసేలా రాత్రింబవళ్లు షెడ్యూల్స్ ని ప్లాన్ చేస్తోంది మూవీ టీమ్. ఈ సినిమా ప్యాన్ ఇండియా రేంజ్ లో ఉండబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు 10 భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్.

మారేడుపల్లి అడవుల్లో కీలకమైన సీన్స్ తీస్తున్నారు. రీసంట్ గా అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ సీన్, ఇంకా సాంగ్ ని ప్లాన్ చేశారు. అక్కడ కొన్ని షాట్స్ ని తీస్కున్నారు. అందుకోసం అక్కడ గిరిజనులకి థ్యాంక్స్ చెప్తూ, వారి సహాయం అనేది ఎంతో మరిచిపోలేనిదని అఫీషియల్ గా ఒక పోస్ట్ చేసింది మూవీ టీమ్. మారేడుమిల్లి , రంపచోడవరం అడవుల్లో సినిమా షూట్ ను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. అలాగే ఈ షూట్ కు సహకరించిన గిరిజనులకి థ్యాంక్స్ అంటూ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా మళ్ళీ కలుద్దాం అంటూ కూడా ఒక హింట్ ఇచ్చారంటే మళ్లీ ఇక్కడ షూటింగ్ ఉందా అనే అనుమానాలకి తావిస్తోంది.

ఇక ఇప్పుడు అడవిలో ఆట అయిపోయింది. నెక్ట్స్ అన్నీ మాస్ యాక్షన్ సీన్స్ తో వేట ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది. నెక్ట్స్ షెడ్యూల్ లో అన్నీ కీలకమైన యాక్షన్ సీన్స్ , ఛేజింగ్ సీన్స్ తీయబోతున్నారట. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించేశారు. ఆగష్ట్ 13వ తేదిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి సుకుమార్ ఈ డేట్ కల్లా ప్రాజెక్ట్ ని ఫినిష్ చేస్తాడా..లేదా అనేది ఆసక్తికంరంగా మారింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందని కనిపించబోతోంది. అదీ విషయం.

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus