Sukumar: ‘పుష్ప 2 ‘ రిలీజ్ విషయంలో సీరియస్ అయిన సుకుమార్.. ఎందుకంటే?

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన ‘పుష్ప'(పుష్ప : ది రైజ్) పాన్ ఇండియా వైడ్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ నటన అందరినీ కట్టిపడేసింది. హిందీ బెల్ట్ లో కూడా ఈ మూవీ రూ.108 కోట్ల నెట్ కలెక్షన్స్ ను సాధించి ట్రేడ్ పండితులకి సైతం షాకిచ్చింది. దీంతో ‘పుష్ప 2 ‘(పుష్ప : ది రూల్) పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

‘పుష్ప’ మొదటి భాగం పెద్ద సక్సెస్ అందుకుంది కాబట్టి.. రెండో భాగాన్ని చాలా శ్రద్ధతో తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. అందుకే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటున్నాడు. కానీ అభిమానులను ఎక్కువ వెయిట్ చేయించాలనే ఆలోచన సుకుమార్ కి లేదు. అందుకే ఆగస్టు 15 న ఈ సినిమాని రిలీజ్ చేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఊహించని విధంగా ఈ సినిమా ‘ఆగస్టు 15 న రిలీజ్ కావడం లేదు.. పోస్ట్ పోన్ అయ్యింది’ అనే ప్రచారం మొదలైంది.

ఈ ప్రచారం వల్ల వేరే సినిమాలు ఆ డేట్ కి రావడానికి రెడీ అయినట్టు పరోక్షంగా హింట్ ఇస్తున్నాయి. ఇది ‘పుష్ప 2’ దర్శకుడు సుకుమార్ కి కోపం తెప్పించాయి. ‘పుష్ప 2 ‘ రిలీజ్ కి 200 రోజుల వరకు టైం ఉంది. అందుకే తన టీంతో ‘పుష్ప గాడి రూల్ 200 ‘ రోజుల్లో మొదలవుతుంది అని అదే డేట్ కి రాబోతున్నట్టు కన్ఫర్మ్ చేస్తూ రెండు రోజుల క్రితం ట్వీట్లు వేశారు.

‘పుష్ప 2 ‘ షూటింగ్ 100 రోజుల్లో కంప్లీట్ అవుతుందట. సో పోస్ట్ ప్రొడక్షన్ పనులకి కూడా ఎక్కువ టైం ఉన్నట్టే. అల్లు అర్జున్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15 రిలీజ్ డేట్ ని మిస్ చేసుకోకూడదు అని గట్టిగా డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఆగస్టు నెల టైంలో నార్త్ లో సినిమాలు బాగా ఆడతాయి కాబట్టి..!

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus