Sukumar: సుకుమార్‌ సినిమాల్లో ఐటెమ్‌ సాంగ్.. ఇప్పటివరకు ఎవరెవరు ఆడిపాడారంటే?

స్టార్‌ హీరోల సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌ ఉండటం ఇటీవల పరిపాటి అయిపోయింది. అందులోనూ స్టార్‌ దర్శకులతో సినిమా అంటే ఇంకా పక్కా అనుకునే పరిస్థితి ఉంది. అలా స్పెషల్‌ సాంగ్స్‌తో కుర్రకారును కిర్రెక్కించే బ్యూటీలను సినిమాల్లోకి తీసుకురావడం ప్రముఖ దర్శకుడు సుకుమార్‌కి (Sukumar) కూడా అలవాటు. ఆయన సినిమాల్లో కచ్చితంగా ఓ ఐటెమ్‌ సాంగ్‌ పెడతారు. దాని కోసం యూత్‌ను మత్తులో పడేసే అందాన్నీ తీసుకొస్తారు. అలా ఇప్పుడు ‘పుష్ప: ది రూల్‌’లో శ్రీలీల ‘కిస్సిక్’ అంటూ వచ్చింది. మరి గతంలో ఎవరు స్పెషల్‌ అయ్యారో చూద్దాం!

Sukumar

* తొలి సినిమా ‘ఆర్య’లోనే (Aarya) సుకుమార్‌ స్పెషల్‌ సాంగ్‌ని జాగ్రత్తగా సెట్‌ చేశారు. ‘అ అంటే అమలాపురం..’ అంటూ అభినయశ్రీ, అల్లు అర్జున్‌ (Allu Arjun) కలసి ఆ పాటలో సందడి చేశారు. ఆ రోజుల్లో ఎక్కడ మైక్‌సెట్‌ పెట్టినా ఈ పాట పక్కా.

* ‘జగడం’ (Jagadam) సినిమా ఫలితం తేడా కొట్టి ఉండొచ్చు కానీ.. ఆ సినిమాలో ‘36 – 24 – 36’ పాట మాత్రం అదిరిపోయింది. మోనాలిసా, మధుశాలినితో (Madhu Shalini) రామ్‌ (Ram) కలసి చేసిన ఆ హై ఓల్టేజ్‌ డ్యాన్స్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే.

* ఒకే ట్యూన్‌లో రెండు పాటలు ఎప్పుడైనా విన్నారా? మామూలుగా అయితే బయట సింగల్స్‌ అంటూ చేస్తారు. కానీ ‘ఆర్య 2’ (Arya 2) సినిమాలో అది టీమే చేసింది. ‘రింగ రింగ..’ అంటూ చేసిన స్పెషల్‌ సాంగ్‌ లిరిక్స్‌ విషయంలో అభ్యంతరాలు వచ్చి రెండుసార్లు రాశారు. ఆ ‘డబుల్’ రైటింగ్‌ పాటలో ఎరినా ఆండ్రియాన అలరించింది.

* ఇక ‘100 % లవ్‌’ (100% Love) సినిమాలో మరోసారి డబుల్ ‘ఐటెమ్‌’ సాంగ్‌ను తీసుకొచ్చారు. ‘డియాలో డియాలా’ అంటూ నాగచైతన్య (Naga Chaitanya) , తమన్నాతో (Tamannaah Bhatia) కలసి మరియం జకారియా, మేఘా నాయుడు (Meghna Naidu) స్టెప్పులేశారు. ఇందులో ఓ సర్‌ప్రైజ్‌ ఐటెమ్‌ గాళ్‌ కూడా ఉంటుంది అనుకోండి.

* సినిమా ఫలితంతో సంబంధం లేకుండా గుర్తుండిపోయే ఐటెమ్‌ సాంగ్‌ అంటే ‘లండన్‌ బాబు..’. మహేష్‌బాబు (Mahesh Babu) హీరోగా రూపొందిన ‘వన్‌: నేనొక్కడినే’ (1: Nenokkadine) సినిమాలోని పాట ఇది. ఇందులో సోఫి చౌదరి ఒయ్యారాలు ఒలకబోసింది.

* సినిమా నేపథ్యానికి తగ్గట్టే ఐటెమ్‌ సాంగ్‌ ఉండాలి. అలా సెట్‌ అయితే థియేటర్ల టాప్‌ లేచిపోయే హడావుడి ఉంటుంది అని నిరూపించిన సినిమా ‘రంగస్థలం’ (Rangasthalam) . ఆ సినిమాలో ‘జిగేలు రాణి..’ అంటూ ప్రముఖ నటి, అప్పటి గోల్డెన్‌ లెగ్‌ పూజా హెగ్డే (Pooja Hegde) రామ్‌చరణ్‌తో (Ram Charan) కలసి కాలు కదిపి చిందేసింది.

* ‘రంగస్థలం’లో స్టార్‌ హీరోయిన్‌ను ‘ఐటెమ్‌ స్టార్‌’ను తీసుకొచ్చిన సుకుమార్‌.. తర్వాతి సినిమాకు ఎవరికి ఆ ప్లేస్‌లో చూపిస్తారు అనే చర్చ బాగా నడిచంది. అందులో ‘పుష్ప: ది రైజ్‌’ (Pushpa) సినిమా కాన్వాస్‌ బాగా పెరగడంతో స్టార్‌లను మించిన స్టార్‌ అవసరం పడింది. దాంతో సమంతతో మాట్లాడి ‘ఉ’ అనిపించారు. కుర్రాళ్లకు థియేటర్‌లో పూనకాలు తెప్పించారు.

* ‘ఉ అంటావా ఊఊ అంటావా’ పాటకు దక్కిన విజయంతో ‘పష్ప: ది రూల్‌’ (Pushpa 2)లో ఏ పాట పెడతారు, ఏ స్టార్‌ హీరోయిన్‌ డ్యాన్స్‌ చేస్తుంది అనే చర్చ గత కొన్ని నెలలుగా సాగుతూనే ఉంది. తొలినాళ్లలో శ్రీలీల (Sreeleela) అని చెప్పినా ఆమె నో చెప్పింది అనే మాటలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆమెనే ఓకే అయింది. ‘కిస్సిక్‌’ అంటూ చిందేసింది.

* శ్రీలీల కంటే ముందు ఆ పాటలో డ్యాన్స్‌ కోసం వినిపించిన పేర్లలో స్టార్‌ హీరోయిన్లు, ఓవర్‌నైట్‌ సెన్సేషన్లు చాలామంది ఉన్నారు. జాన్వీ కపూర్‌(Janhvi Kapoor), కియారా అడ్వాణీ(Kiara Advani), శ్రద్ధా కపూర్‌ (Shraddha Kapoor)  , త్రిప్తి డిమ్రి (Tripti Dimri) .. ఇలా చాలా పేర్లే వినిపించాయి. ఒకానొక సమయంలో మళ్లీ సమంతనే చేస్తుంది అని అన్నారు.

* సుకుమార్‌ (Sukumar) ఐటెమ్‌ సాంగ్స్‌ గురించి చర్చ వచ్చేప్పుడు హీరోయిన్ల గురించి మాట్లాడుకోవడం ఎంత ముఖ్యమో, ఆ పాటకు సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్‌ (Devi Sri Prasad) గురించి మాట్లాడటమూ అంతే ముఖ్యం. ఆయన ఇచ్చిన ట్యూన్స్‌ కారణంగానే ఆ పాటలకు ఊపు వచ్చింది.

* ఆ హిట్‌ స్ట్రీక్‌ను కొనసాగిస్తూ ఇప్పుడు ‘కిస్సిక్‌’ కూడా మంచి బీట్‌ ఉన్న పాట అయి ఉంటుందని ఆశించొచ్చు. దానికి తగ్గ లిరిక్‌లు కూడా పడుతున్నాయి. అవే విజయాలకు కారణం అవుతున్నాయి.

‘మట్కా’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ వేదికగా మరోసారి బయటపడ్డ ‘మెగా’ విభేదాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus