ఆ స్టార్ హీరోలలో సురేందర్ రెడ్డి నెక్స్ట్ సినిమా కి ఎవర్ని ఎంచుకుంటాడో?

మెగాస్టార్ చిరంజీవితో ‘సైరా నరసింహారెడ్డి’ వంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించే గొప్ప అవకాశం దక్కించుకున్నప్పటికీ.. ఆ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటాడా..? అని దర్శకుడు సురేందర్ రెడ్డి పై చాలా అనుమానాలు ఉండేవి. అయితే ఇదంతా రిలీజ్ కు ముందు సంగతి. సినిమా చూసిన తరువాత ప్రతీ ఒక్క ప్రేక్షకుడితో శభాష్ అనిపించుకున్నాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని ఎంతో శ్రద్దగా తెరకెక్కించాడు సురేందర్ రెడ్డి. ఇక ఈ చిత్రం తర్వాత సురేందర్ రెడ్డి నెక్స్ట్ ఏ హీరోతో చేస్తాడా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

సురేందర్ రెడ్డి.. నిర్మాతలు ‘మైత్రి మూవీ మేకర్స్’ వారితో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇక వారికి రాంచరణ్, ఎన్టీఆర్, మహేష్ లు కూడా ఓ సినిమా చేయాల్సి ఉంది. ఎన్టీఆర్, రాంచరణ్.. ఎలాగూ ‘ఆర్.ఆర్.ఆర్’ తో బిజీగా ఉన్నారు. ఇక మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ పూర్తవ్వగానే ఖాళీ అవుతాడు. తన తరువాత చిత్రం వంశీ పైడిపల్లి లేదా పరశురామ్ తో చేస్తాడని వార్తలు వస్తున్నా.. ఇంకా ఫిక్స్ కాలేదని తెలుస్తుంది. దీంతో మహేష్ తో సురేందర్ రెడ్డి సినిమా చేసే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. ‘సైరా’ చూసాక మహేష్ కూడా సురేందర్ రెడ్డి కి ఫోన్ చేసి ప్రశంసించాడట. ఆ సందర్భంలో ‘మన సినిమా ఎప్పుడు’ అని కూడా డిస్కస్ చేసుకున్నారట. గతంలో వీరిద్దరూ ‘అతిధి’ చేశారు. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో ఈసారి కచ్చితంగా హిట్ సినిమానే చేయాలి అని వీరు అనుకుంటున్నారట. ఇక సురేందర్ రెడ్డి ఒక నెల గ్యాప్ తీసుకుని.. ఆ పని మొదలుపెడతాను అని మహేష్ కు చెప్పాడట. ఇప్పుడు తన ఫ్యామిలీతో విదేశాలకు టూర్ వెళ్ళే పనిలో సురేందర్ ఉన్నాడని తెలుస్తుంది. తిరిగి వచ్చాక నెక్స్ట్ సినిమా పై కసరత్తులు మొదలు పెడతాడన్నమాట.

సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus