Surender Reddy: సూరి ఫస్ట్ ఛాయిస్ ఎవరు.. విక్రమా? వెంకటేషా?

సురేందర్ రెడ్డి.. ‘సైరా’ తర్వాత ‘ఏజెంట్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అఖిల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి షోతోనే నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా అద్భుతాలు చేసింది అంటూ ఏమీ లేదు. అంతకు ముందు వచ్చిన ‘సైరా’ కూడా బాక్సాఫీస్ వద్ద సేఫ్ అయ్యింది లేదు. దీంతో సురేందర్ రెడ్డి కెరీర్ డైలమాలో పడింది. ఇక అతనికి ప్రాజెక్టులు రావడం కష్టమే అనుకుంటున్న టైంలో..

బడా ప్రాజెక్టులు సెట్ చేసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ముందుగా పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ వారి బ్యానర్ కోసం ఓ ఆఫీస్ ను ఓపెన్ చేసి సురేందర్ రెడ్డికి అప్పగించారు నిర్మాత రామ్ తాళ్లూరి. ఆ ప్రాజెక్టు స్క్రిప్ట్ దశలో ఉండగానే.. వెంకటేష్ తో ఓ ప్రాజెక్టు చేయడానికి రెడీ అయ్యాడు సురేందర్ రెడ్డి. అంతేకాదు ఇటీవల చెన్నై కూడా వెళ్లి విక్రమ్ కి కథ వినిపించి ఓకే చేయించుకున్నాడు. పవన్ కళ్యాణ్ తో సినిమా ఇప్పట్లో కష్టం.

ఇక ‘సైందవ్’ మూవీతో వెంకటేష్ చాలా బిజీ. అయితే అది డిసెంబర్ నాటికి కంప్లీట్ అయిపోతుంది. అయినప్పటికీ సురేందర్ రెడ్డి.. వెళ్లి విక్రమ్ కి కథ చెప్పడంతో అందరిలో కన్ఫ్యూజన్ ఏర్పడింది. విక్రమ్ ఇప్పుడైతే ఖాళీగా లేడు. ‘తంగలాన్’ అనే సినిమా షూటింగ్లో అతను కంప్లీట్ గా బిజీ అయిపోయాడు. పైగా అతని మేకోవర్ కూడా మార్చుకోవడానికి టైం పడుతుంది. మరి (Surender Reddy) సురేందర్ రెడ్డి ప్లానింగ్ ఎలా ఉందో.. నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడో చూడాలి.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus