Surya Kiran: సినీ పరిశ్రమలో విషాదం.. హీరోయిన్ కళ్యాణి భర్త కన్నుమూత!

సినీ పరిశ్రమని విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2024 లో చూసుకుంటే.. అప్పుడే చాలా విషాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ‘బేబీ’ నిర్మాత అయిన ఎస్.కె.ఎన్ తండ్రి మరణించారు. తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు రషీద్ ఖాన్,సీనియర్ హీరో వేణు తండ్రి, అలాగే దర్శకుడు వెట్రి దురై, సింగర్ విజయలక్ష్మి అలియాస్ మల్లికా రాజ్ పుత్,’దంగల్’ నటి అయిన సుహానీ భట్నాగర్, ప్రముఖ రచయిత కమ్ నిర్మాత అయిన వి.మహేశ్, దర్శకుడు చిదుగు రవిగౌడ్‌, ‘మొగలిరేకులు’ ఫేమ్ పవిత్రనాథ్ కూడా మరణించడం జరిగింది.

ఆ షాక్ ల నుండి సినిమా పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే మరో దర్శకుడు కమ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ మృతి చెందడం షాక్ ఇచ్చే విషయం. వివరాల్లోకి వెళితే.. ‘సత్యం’ సినిమా దర్శకుడు, హీరోయిన్ కళ్యాణి మాజీ భర్త, బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ అయిన సూర్య కిరణ్.. మృతి చెందారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ వస్తున్న ఆయన సోమవారం నాడు చెన్నైలో చివరి శ్వాస విడిచారు. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ మొత్తం షాక్ కి గురైంది.

ఈయన (Surya Kiran) వయసు 43 ఏళ్ళు మాత్రమే కావడం విషాదకరం. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన సూర్య కిరణ్ చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించాడు. 2003 లో సుమంత్ తో (Satyam) ‘సత్యం’ అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత (Dhana51) ‘ధన 51 ‘ ‘బ్రహ్మాస్త్రం’ (Raju Bhai) ‘రాజు భాయ్’ వంటి సినిమాలు ఈయన డైరెక్ట్ చేయడం జరిగింది. కళ్యాణిని (Kalyani) ప్రేమించి పెళ్లి చేసుకున్న సూర్య కిరణ్.. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు.

‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!

స్టార్‌ హీరో అజిత్‌ హెల్త్‌ అప్‌డేట్‌ వచ్చేసింది… ఎలా ఉందంటే?
ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus