ఉదయ్ కిరణ్ అకాల మరణం సినీ ప్రియులను అత్యంత బాధపెట్టిన సంఘటన. ఉదయ్ కిరణ్ ని చాలా మందికి తమ ఇంట్లో కుర్రాలుడిలా, బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపించేవాడు. ఆయన సినిమాలు బాగా ప్రేక్షకులలోకి వెళ్లడం వలన అతని ప్రభావం అందరిపై ఉండేది. ఐతే ఆయన మరణానికి కారణం ఏమిటనేది ఎవరికీ తెలియని విషయం. ఆయనకు సినిమా అవకాశాలు తగ్గడం, మునుపటి ఫ్రెండ్స్, పరిచయాలు దూరం కావడం మరియు ఆర్ధిక ఇబ్బందులే కారణమని అప్పటి మీడియా కోడై కూసింది.
ఇక కెరీర్ పరంగా ఉదయ్ కిరణ్ అలా వెనుకబడిపోవడానికి కారణం చిరంజీవి కుటుంబమే… కావున పరోక్షంగా వారే ఉదయ్ కిరణ్ చావుకి కారణం అని మరి కొందరు చెప్పుకోవడం జరిగింది. ఐతే ఉదయ్ కిరణ్ ని హీరోగా చిత్రం సినిమాతో పరిచయం చేసి, ఆ తదుపరి ఏడాదే నువ్వు నేను సినిమాతో బిగ్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు తేజ ఉదయ్ కిరణ్ మరణం గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉదయ్ కిరణ్ మరణానికి కారణం చిరంజీవి అనే విషయాన్ని ఆయన ఖండించారు.
అలాగే వరుస పరాజయాలు ఎదురుకావడం, సినిమా ఆఫర్స్ తగ్గడం కూడా కారణం కాదని ఆయన అన్నారు. ఎందుకంటే ఉదయ్ కిరణ్ మరణానికి చాలా కాలం ముందు నుండే ఆఫర్స్ తగ్గిపోయాయి. చనిపోయే నాటికి అది ఉదయ్ కిరణ్ కి అలవాటైపోయి ఉండాలి. మనలో ఎవ్వరికీ తెలియని బలమైన కారణం ఏదో ఉంది. ఆ ఒత్తిడిని తట్టుకోలేకే ఉదయ్ కిరణ్ ఆత్మ హత్య చేసుకున్నారు అన్నారు. ఇక సూసైడ్ ఓ పిరికి చర్య, చనిపోయి ఏమి సాధించాడు అని డైరెక్టర్ తేజ చెప్పుకొచ్చారు.