Director Teja, Suresh Babu: సురేష్ బాబు పై దర్శకుడు తేజ ఒత్తిడి.. కారణం అదేనట..!
- August 9, 2021 / 07:08 PM ISTByFilmy Focus
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు తన చిన్న కొడుకు అభిరామ్ ను హీరోగా పరిచయం చేయబోతున్న సంగతి తెలిసిందే.దర్శకుడు తేజ .. అభిరామ్ ను లాంచ్ చేయబోతున్నాడు.ఆల్రెడీ ఈ ప్రాజెక్టుకి సంబంధించి షూటింగ్ మొదలయ్యింది. అయితే నిర్మాత సురేష్ బాబుకి దర్శకుడు తేజ మధ్య ఏదో ఒక ఇష్యు పై చర్చ మొదలవ్వడం.. ఈ చిత్రం షూటింగ్ డిలే అవ్వడం జరుగుతుందని ఇన్సైడ్ టాక్. సురేష్ బాబు… ఊరికే అనవసరపు ఖర్చు చేయరు.!
అతను సహా నిర్మాతగా వ్యవహరించే సినిమాలకు కూడా అనవసరమైన ఖర్చు పెట్టించరు.అభిరామ్ డెబ్యూ మూవీ నిర్మాణానికి కూడా ఆయన ఇదే పద్దతిని ఫాలో అవుతున్నాడట. నిజానికి ఈ మూవీలో హీరోయిన్ గా కృతి శెట్టిని తీసుకోవాలని దర్శకుడు తేజ అనుకున్నాడు. కానీ ఆమె కోటి డిమాండ్ చేయడంతో ‘కృతి బదులు వేరే హీరోయిన్ తీసుకుందాం’ అని ఆయన లైట్ తీసుకున్నారు.ఇప్పుడు సముద్రఖని వంటి స్టార్ నటుడు కావాలని తేజ.. సురేష్ బాబుని కోరాడట.

సముద్రఖనిని కూడా సంప్రదించారు.కానీ ఆయన కూడా ఈ సినిమాలో పారితోషికం గట్టిగానే అడిగాడు. దీనికి కూడా సురేష్ బాబు నో చెప్పినట్టు తెలుస్తుంది. కానీ తేజకి మాత్రం సురేష్ బాబునే ఎంపిక చేసుకోవాలని పట్టుబట్టి కూర్చున్నాడు. ఏదో ఒకరకంగా సురేష్ బాబుని ఒప్పించాలని అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. మరి అతని ప్రయంత్నం ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి..!
Most Recommended Video
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!












