Director Teja: ఎన్టీఆర్ బయోపిక్ అవకాశాన్ని అలా మిస్ అయ్యానన్న తేజ.. ఏమైందంటే?

బాలకృష్ణ క్రిష్ కాంబినేషన్ లో ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు తెరకెక్కగా ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు. ఈ సినిమాలు నిర్మాతలకు సైతం భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చాయి. ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం తేజకు వచ్చినట్టే వచ్చి మిస్ కావడం గమనార్హం. డైరెక్టర్ తేజ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. తాను వదిలేసుకున్న సినిమాల సంఖ్య 70 కంటే ఎక్కువగా ఉందని తేజ చెప్పుకొచ్చారు.

అలా ఎన్టీఆర్ బయోపిక్ మిస్సైందని (Director Teja) ఆయన అన్నారు.బాలయ్యతో సినిమాను మిస్ చేసుకున్నానని బాధ లేదని తేజ కామెంట్లు చేశారు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ ను వదులుకోవడం నాకు ఎంతో బాధ పెట్టిందని తేజ చెప్పుకొచ్చారు. అయితే అప్పుడు తీయలేకపోయినా ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని తేజ కామెంట్లు చేయడం గమనార్హం. హరికృష్ణ మనవడితో ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని ఆయన వెల్లడించారు. అయితే నెటిజన్ల నుంచి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.

బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ ఆశించిన ఫలితాన్ని అందుకోలేదని హరికృష్ణ మనవడితో మళ్లీ రిస్క్ చేయడం ఎందుకని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన అహింస మూవీ జూన్ నెల 2వ తేదీన విడుదల కానుంది. అభిరామ్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. అహింస మూవీతో తేజ సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాల్సి ఉంది.

రానా తేజ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా ఆ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లాల్సి ఉందో తెలియాల్సి ఉంది. రానా సోలో హీరోగా కెరీర్ పరంగా మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రానా కథల ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus