Anushka: వీఎఫ్ఎక్స్ తో అనుష్కను స్లిమ్ గా చూపిస్తారట!

దక్షిణాది స్టార్ హీరోయిన్ అనుష్క.. ఒకప్పటితో పోలిస్తే సినిమాలు చేయడం బాగా తగ్గించేసింది. ‘బాహుబలి2’ తరువాత ‘భాగమతి’, ‘నిశ్శబ్దం’ వంటి సినిమాలు మాత్రమే చేసింది. రీసెంట్ గా నవీన్ పోలిశెట్టి హీరోగా ఓ సినిమా సైన్ చేసింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అనుష్క చెఫ్ పాత్రలో కనిపించనుంది. దాదాపు ఈ సినిమా షూటింగ్ చివరి స్టేజ్ కి చేరుకుంది. ఇంతలో అనుష్క మరో సినిమా ఒప్పుకుందట.

కోలీవుడ్ దర్శకుడు ఏఎల్ విజయ్ రూపొందిస్తోన్న సినిమాలో అనుష్క నటించబోతుందని సమాచారం. ‘సైజ్ జీరో’ సినిమా కోసం బాగా బరువు పెరిగిన అనుష్క.. ఆ తరువాత స్లిమ్ లుక్ లోకి రావడానికి చాలానే ప్రయత్నిస్తుంది. మొన్నామధ్య స్లిమ్ లుక్ లో ఓ ఫొటోషూట్ లో పాల్గొని ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసింది. అయితే ఇప్పుడు మళ్లీ ఆమె లావైనట్లు కనిపిస్తోంది. అయితే దర్శకుడు విజయ్ సినిమాలో మాత్రం అనుష్కని గ్రాఫిక్స్ వాడి స్లిమ్ లుక్ లో చూపిస్తారని అంటున్నారు.

‘బాహుబలి2’ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో అలానే చూపించారు. అంతేకాదు.. బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో యంగ్ ఏజ్ సీన్స్ కోసం స్పెషల్ కెమెరా టెక్నిక్ వాడినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అనుష్క సినిమాకు కూడా అదే కెమెరా టెక్నాలజీ వాడి ఆమెని సన్నగా చూపిస్తారని సమాచారం. అయితే అనుష్క ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

గ్రాఫిక్స్ ఎంతగా వాడినప్పటికీ.. స్క్రీన్ మీద తేలిపోతుందని.. దానికి బదులు అనుష్క తన ఫిజిక్ మీద దృష్టి పెడితే మంచిదని సలహాలు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే.. విజయ్ తన సినిమాలో అనుష్కని టెక్నాలజీ వాడి చూపిస్తారనేది బయట జరుగుతున్న ప్రచారం మాత్రమే. అందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సివుంది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus