Trivikram: త్రివిక్రమ్ తో సునీల్.. 30 రూపాయల కథ!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్‌లో ప్రముఖ డైరెక్టర్‌గా తనదైన ముద్ర వేసుకున్నారు. ఇక త్రివిక్రమ్ సునీల్ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. త్రివిక్రమ్, నటుడు సునీల్ ఇద్దరూ స్నేహితులు మాత్రమే కాకుండా, మొదట్లో రూమ్‌మేట్స్ కూడా. వారి స్నేహం, సినీ కెరీర్ కోసం కలసికట్టుగా ఎదుర్కొన్న కష్టాల గురించి సునీల్ (Sunil) పలు సందర్భాల్లో పంచుకున్నారు. తాజాగా లక్కీ భాస్కర్ ’ (Lucky Baskhar)  ప్రీరిలీజ్ ఈవెంట్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram), ఒకప్పుడు ఎదుర్కొన్న మనీ సమస్యలపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Trivikram

30 రూపాయలతో గడవాల్సి వచ్చిన రోజులను మరవలేమని అన్నారు. ఆ సమయంలో తాము ఒక రూమ్‌లో నివసిస్తుండగా, హౌస్ ఓనర్ ఖాళీ చేయమని చెప్పడం, చేతిలో ఏమీ లేక పోవడం సునీల్‌ను తీవ్రంగా ఆందోళనకు గురి చేసిందని గుర్తుచేసుకున్నారు. మూడు రోజులు ఆ తక్కువ సొమ్ముతో 30 రూపాయలతో గడపాలని సునీల్ ఆలోచించి ప్లాన్ వేశాడట. ఇక ఆ సమయంలో మార్కెట్‌లో కొత్తగా వచ్చిన కోక్ టిన్ కొనడానికి త్రివిక్రమ్ 28 రూపాయిలు ఖర్చు చేసేసరికి, సునీల్ ఆశ్చర్యపోయడట.

“మూడు రోజులు ఆలోచించకు, రేపు బ్రతకడం ఎలా అనేది ఇప్పుడు ఆలోచిద్దాం” అంటూ ఆ సింపుల్ కాన్సెప్ట్ సునీల్‌కు చెప్పాడట. ఆ విషయాన్ని త్రివిక్రమ్ ఈ ఈవెంట్ లో షేర్ చేసుకున్నారు. అలాంటి కష్టకాలంలో ఇద్దరూ తట్టుకొని, ఈ రోజు ఇండస్ట్రీలో గౌరవనీయ స్థానానికి చేరుకోవడం ఒక పెద్ద స్ఫూర్తిదాయకమైన ప్రయాణంగా మారింది.

ఇప్పటికి త్రివిక్రమ్ సినిమాల్లో సునీల్ చిన్న పాత్రల్లో కనిపిస్తూ ఉంటారు. నటుడిగా, కమెడియన్‌గా తెలుగు చిత్రసీమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సునీల్, పాన్ ఇండియా స్థాయిలో ఇప్పుడు అవకాశాలు అందుకుంటున్నారు. ఇక త్రివిక్రమ్ నెక్స్ట్ అల్లు అర్జున్ (Allu Arjun) తో కొత్త ప్రాజెక్టును స్టార్ట్ చేయనున్నారు. ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఉండనున్నట్లు టాక్. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ అయినట్లు సమాచారం.

సామ్ – చైతూ.. ఆఖరి ఫొటో డిలీట్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus