‘రోజా’ ‘పెళ్ళి సందడి’ సినిమాలు త్రివిక్రమ్ నిజజీవితాన్ని బట్టి తీసారా?

త్రివిక్రమ్ శ్రీనివాస్ … ఈ దర్శకుడికి ఎంతో మంది లాయల్ ఫ్యాన్స్ ఉంటారు. కేవలం ఇతని సినిమాల గురించి మాత్రమే కాదు .. ఇతని సినిమాల్లోని పంచ్ డైలాగ్ ల కోసమే కాదు … స్టేజి పై ఇతని స్పీచ్ ల కోసం కూడా. నిజ జీవితంలోని సంగతులని.. మనం గుర్తించలేని అందాల్ని ఆయిన స్పీచ్ మనకి పరిచయం చేస్తుంది. ఎంతో స్పష్టంగా మాట్లాడుతారు ఈయన. త్రివిక్రమ్ మాటల్ని బట్టి ఆతని లైఫ్ స్టైల్ ఇంకెంత అందంగా ఉంటుందో తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది.

ముఖ్యంగా అతని ఫ్యామిలీకి సంబందించిన విషయాల్ని తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. త్రివిక్రమ్ భార్య పేరు సౌజన్య. ఈమె పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సోదరుడి కుమార్తె. త్రివిక్రమ్ పెళ్ళి కహానీ చాలా సినిమాటిక్ గా జరిగింది. మొదట త్రివిక్రమ్.. తన భార్య సౌజన్య ను కాకుండా.. ఆమె అక్కని చూడటానికి వెళ్ళాడట.కానీ త్రివిక్రమ్ కు వాళ్ళ అక్క కన్నా సౌజన్య నే బాగా నచ్చిందట. ఆ సమయంలో తన మనసులో ఉన్న మాటను.. ఏమాత్రం మోహమాటం లేకుండా చెప్పేశాడట. అక్క కాదు చెల్లె నచ్చిందని..!

Director Trivikram Srinivas love story and marriage details1

సీతారామశాస్త్రికి త్రివిక్రమ్ బాగా తెలిసిన కుర్రాడు కావడం, అందులోనూ అతనిది మంచి కుటుంబం.. అని అలోచించి వెంటనే ఒప్పేసుకున్నారట. అయితే ఓ షరతు మాత్రం పెట్టారట. ముందుగా ‘పెద్ద అమ్మాయి పెళ్ళి జరిగాకే… మీ పెళ్లి’ అన్ని ఇరు కుటుంబ సభ్యులు..ఓ మాట అనేసుకున్నారట. అలా ఓ సంవత్సరం తరువాత సౌజన్య ని విహహం చేసుకున్నాడట మన గురూజీ…! ఇప్పుడు వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు.ఏమైనా గురూజీ పెళ్ళి కహానీ విన్నాక… ‘రోజా’ ‘పెళ్ళి సందడి’ వంటి చిత్రాలు గుర్తొచ్చేలా ఉన్నాయి కదూ.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus