Balakrishna: ‘ఎన్.బి.కె 109’ అనౌన్స్మెంట్ పోస్టర్ లో ఇది గమనించారా..?

ఈరోజు అనగా జూన్ 10 న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. అందుకే బాలయ్య నెక్స్ట్ సినిమాల అప్డేట్స్ తో సోషల్ మీడియాలో సందడి మొదలైంది. ఉదయం ‘భగవంత్ కేసరి’ టీజర్ రిలీజ్ అయ్యింది. అలాగే రామానాయుడు స్టూడియోస్ లో బాబీ దర్శకత్వంలో బాలయ్య చేయబోతున్న 109 వ చిత్రం కూడా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇది త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ లాంటిది.

కొంతకాలంగా ‘ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌’ అనే బ్యానర్ ను స్థాపించి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు త్రివిక్రమ్.తన భార్య సాయి సౌజన్య పేరు పై ఈ బ్యానర్ రన్ అవుతుంది. కానీ వెనకుండి నడిపించేది అంతా త్రివిక్రమే అనే సంగతి తెలిసిందే.బిజినెస్ లో 30 శాతం వాటా కూడా త్రివిక్రమ్ కి ఉంటుంది. స్క్రిప్ట్ లో త్రివిక్రమ్ జోక్యం ఉంటుంది. అవసరమైతే అతనికి నచ్చినట్టు మార్పులు చేయించి స్క్రిప్ట్ ఫైనల్ చేస్తారు. ఇక బాలయ్య 109 సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ ను చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశాడు బాబీ.

మద్యం సీసా, గొడ్డలి, ఇతర పదునైన ఆయుధాలతో (Balakrishna) బాలయ్య మాస్ ఇమేజ్ కు తగ్గట్టు ఈ పోస్టర్ ను డిజైన్ చేశారు. ‘వయలెన్స్ కా విజిటింగ్ కార్డ్’ అనే లైన్ తో ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది చెప్పకనే చెప్పారు. ‘ప్రపంచానికి అతను తెలుసు.. కానీ అతని ప్రపంచం ఎవరికీ తెలియదు’ అంటూ ట్యాగ్‌లైన్ ను కూడా జతచేయడం జరిగింది. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టి 2024 ప్రారంభంలో విడుదల చేయాలని భావిస్తున్నారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus