Venu Udugula, Venkatesh: పోరాటాల దర్శకుడి కొత్త సినిమా ఫిక్స్‌.. ఎప్పుడు స్టార్ట్‌ అవుతుందంటే?

ఆ దర్శకుడు పోరాటాల సినిమాలకు ప్రసిద్ధి. పోరాటాలు అంటే మనం సినిమాల్లో చూసే సగటు ఫైట్స్‌ కాదు. జీవిత పోరాటాల స్పెషలిస్ట్‌ ఆయన. దీని గురించి మీకు క్లియర్‌గా అర్థం కావాలంటే ఆయన చేసిన సినిమాల పేర్లు చెబుతాం మీకే తెలిసిపోతుంది. తొలి సినిమా ‘నీదీ నాదీ ఒకే క‌థ‌’ కాగ, రెండో సినిమా ‘విరాట‌ప‌ర్వం’ (Virata Parvam). ఇప్పుడు అర్థమైందిగా ఆ దర్శకుడు ఎవరో. ఆయనే వేణు ఉడుగుల‌ (Venu Udugula) . ఆయన కొత్త సినిమా గురించే ఈ వార్త.

వేణు ఉడుగుల తీసింది రెండు సినిమాలే అయినా.. సామాజిక బాధ్య‌త సినిమాల‌కూ ఉంద‌ని న‌మ్మి, అలాంటి క‌థ‌ల‌నే తెరకెక్కించిన వ్యక్తి ఆయన. ఇప్పుడు ఆయన సినిమాకు ప్రతిష్ఠాత్మక ఫిలిం ఫేర్‌ అవార్డులు కూడా వచ్చాయి. రానా (Rana Daggubati) – సాయిపల్లవి (Sai Pallavi)  నటించిన ‘విరాట‌ప‌ర్వం’ చిత్రానికి ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు, అవార్డులు ద‌క్కాయి. ఇప్పుడు ఉత్త‌మ న‌టి (క్రిటిక్స్‌)గా సాయి ప‌ల్ల‌వి, ఉత్త‌మ స‌హాయ న‌టిగా నందితా దాస్‌ (Nandita Das) అవార్డులు గెలుచుకొన్నారు.

అలాంటి దర్శకుడి కొత్త సినిమా ఏంటి అనే చర్చ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఆయన సురేశ్‌ ప్రొడక్షన్స్‌లోనే నెక్స్ట్‌ సినిమా ఉంటుందని అప్పట్లోనే చెప్పారు. అంతేకాదు రానా హీరోగానే సినిమా చేస్తారు అని కూడా అన్నారు. మరికొందరైతే వెంకటేశ్‌తో (Venkatesh)  సినిమా ఉంటుంది అని కూడా చెప్పారు. ఫైనల్‌గా ఇప్పుడు వెంకటేశ్‌తో సినిమా చేస్తున్నారట. వెంక‌టేష్ కోసం వేణు ఓ క‌థ సిద్ధం చేస్తున్న‌ట్టు స‌మాచారం.

స్క్రిప్టు ప‌నులు ఇప్పుడు శరవేగంగా జరుగుతున్నాయట. అంతేకాదు ఈ సినిమాలో వెంక‌టేష్‌తో పాటు మ‌రో ఇద్ద‌రు యువ హీరోలు కూడా ఈ సినిమాలో ఉంటారని చెబుతున్నారు. వెంక‌టేష్ ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి (Anil Ravipudi)   సినిమా పనుల్లో ఉన్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైంది. ఆ సినిమా తర్వాత వేణు ఉడుగుల సినిమా ఉంటుంది అని చెబుతున్నారు. వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు అని చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెలలోనే అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus