Vetrimaaran: నలుగురు హీరోల అభిమాలనుకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన స్టార్‌ డైరక్టర్‌!

కొంతమంది దర్శకులు అస్సలు కమర్షియల్‌ సినిమాలు తీయరు, ఆ మాటకొస్తే అస్సలు ఆ దరిదాపుల్లోకి కూడా పోరు. కానీ అతనితో సినిమా తీయాలి అంటే మాస్‌ హీరోలు, స్టార్‌ హీరోలు ముందుకొస్తుంటారు. ఆయన సినిమా సమ్‌థింగ్‌ స్సెషల్‌గా ఉంటుంది అని వారు నమ్మడమే కారణం. అలాంటి దర్శకుల్లో వెట్రిమారన్‌ ఒకరు. తమిళనాటు స్టార్‌ డైరక్టర్‌ అయిన వెట్రిమారన్‌ చాలా రోజులుగా తెలుగులో ఓ సినిమా చేస్తారని వార్తలొచ్చాయి. అయితే ఇప్పటికప్పుడు కష్టం అని ఆయన ఇటీవల క్లారిటీ ఇచ్చారు.

ఇప్పుడు మరోసారి (Vetrimaaran) తన నాలుగు సినిమాల విషయంలో స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇటీవల ఓ కార్యక్రమానికి వచ్చిన ఆయన తన రాబోయే సినిమాల గురించి మాట్లాడారు. అందులో ఎన్టీఆర్‌తో సినిమా ప్రస్తావన కూడా ఉంది. ప్రస్తుతం వెట్రిమారన్‌ ‘విడుదలై’ సీక్వెల్‌ పనుల్లో బిజీగా ఉన్నారట. ఇటీవల వచ్చిన ‘విడుదలై 1’ మంచి విజయం అందుకుంది. ఆయన స్టైల్‌లో అదిరిపోయింది అని చెప్పాలి. అందుకే ‘విడుదలై 2’ కోసం ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ పూర్తవుతుందట.

ఇక ‘విడుదలై 2’ సినిమా పనులు పూర్తికాగానే ‘వాడి వాసల్‌’ సినిమా చిత్రీకరణ పునర్‌ ప్రారంభిస్తామని వెట్రిమారన్‌ చెప్పారు. సూర్య ప్రధాన పాత్రలో మొదలైన ఈ చిత్రానికి కొన్నాళ్లు గ్యాప్‌ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ షురూ చేస్తారట. జల్లికట్టు నేపథ్యంలో సాగే ఎద్దు సన్నివేశాల కోసం లండన్‌లో ఇప్పటికే విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు మొదలయ్యాయని దర్శకుడు తెలిపారు. ప్రస్తుతం ఓకే చేసిన సినిమాలన్నీ పూర్తయ్యాక ‘వడ చెన్నై’ సినిమా సీక్వెల్‌ చేసే అవకాశం ఉందని చెప్పారు.

ధనుష్‌ హీరోగా ఆయన నుండి వచ్చిన ‘వడ చెన్నై’ తమిళనాట భారీ హిట్‌గా నిలిచింది. ఆ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందని చాలా రోజుల క్రితమే చెప్పారు. ఇప్పుడు మరికాస్త క్లారిటీ ఇచ్చారు. అలాగే దళపతి విజయ్‌తో ఓ సినిమా చేయడానికి చర్చలు జరుగుతున్నాయని కూడా చెప్పారు. అలాగే ఎన్టీఆర్‌తో సినిమా గురించి కూడా చెప్పారు. ఆ సినిమాకు చాలా సమయం పడుతుందన్న ఆయన… అది సోలో హీరో మూవీనా, మల్టీస్టారరా? అనేది కాలమే నిర్ణయిస్తుంది అని అన్నారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus