నిన్నమొన్నటివరకూ తన తోటి కథానాయకులందరికంటే ఎక్కువ సినిమాలు చేస్తూ యమ బిజీగా సమయాన్ని గడపడంతోపాటు లేడీ సూపర్ స్టార్ డమ్ ను ఎంజాయ్ చేసిన అనుష్క ఇప్పుడు చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేకుండా, అసలు ప్రస్తుతం ఎక్కడ ఉందో కూడా తెలియకుండా ఉంది. అనుష్క ఆచూకీ కోసం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ దర్శకనిర్మాతలు భీభత్సంగా వెతుకుతున్నారు. అనుష్క వారందరి నుంచి తప్పించుకొని తిరగకపోయినా.. ఎవరికీ చిక్కకుండా మాత్రం ఎక్కడో సైలెంట్ గా ఉంటోంది. అదెక్కడా అంటే.. యూరప్ లో. అక్కడ వెయిట్ లాస్ ట్రీట్ మెంట్ తీసుకొంటోంది అనుష్క. కేరళలో ట్రీట్ మెంట్ అనంతరం బ్యాక్ టు షేప్ అయినా కూడా బరువు తగ్గకపోవడంతో అనుష్క యూరప్ కి వెళ్లిందట. అక్కడ ఒక 20 కేజీల బరువు తగ్గే ప్రయత్నంలో నిర్విరామంగా శ్రమిస్తోంది అనుష్క. ఈ బరువు తగ్గడం కోసం అనుష్క చాలా కష్టపడుతోందట.
ఈ గ్యాప్ లో మళ్ళీ సినిమా చేస్తే ఎక్కడ తగ్గుతున్న వెయిట్ పెరుగుతుందో అన్న భయంతో సినిమాలేవీ ఒప్పుకోకుండా తన కాన్సన్ ట్రేషన్ మొత్తం వెయిట్ లాస్ మీదే పెట్టింది. ఈ ట్రీట్ మెంట్ మరో నాలుగు నెలలపాటు సాగనుందట. ఆ తర్వాతే ఏదైనా సినిమా ఒప్పుకొంటుందట అనుష్క. అప్పటివరకూ సినిమాలకు, ఇండస్ట్రీకి దూరంగానే ఉంటుందట. మరి అనుష్క ప్రయాస వృద్ధాపోకుండా.. మళ్ళీ “విక్రమార్కుడు”లో అనుష్కను చూస్తామేమో.