టాలీవుడ్ కి దీపావళి పెద్దగా కలిసి రాదు. దీపావళి పండగ కానుకగా ఎన్ని సినిమాలొచ్చినా.. పెద్దగా ఆడింది లేదు. ఈసారి కూడా అలాంటి బ్యాడ్ సెంటిమెంట్ కొనసాగింది. ఈ దీపావళికి మొత్తం మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అవేంటంటే.. ‘మంచి రోజులు వచ్చాయి’, ‘పెద్దన్న’, ‘ఎనిమీ’. మారుతి డైరెక్ట్ చేసిన ‘మంచి రోజులు వచ్చాయి’ సినిమా ఒకరోజు ముందుగానే ప్రీమియర్లు పడ్డాయి. కానీ ఈ సినిమా ప్రేక్షకులకు నిరాశనే మిగిల్చింది.
సరైన కంటెంట్ లేకపోవడంతో మారుతి కామెడీ కూడా వర్కవుట్ కాలేదు. ఇక రజినీకాంత్ నటించిన ‘పెద్దన్న’ సినిమా కూడా దీపావళి కానుకగా విడుదల చేశారు. కానీ ఇలాంటి కథతో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. కథలో ఎలాంటి కొత్తదనం లేదు. రజినీకాంత్ ఫ్యాన్స్ కు నచ్చే ఎలిమెంట్స్ ను నమ్ముకొని తీసిన సినిమా ఇది. కానీ రజినీకాంత్ ఫ్యాన్స్ కూడా కొత్తదనాన్ని కోరుకుంటున్నారనే విషయాన్ని దర్శకుడు పట్టించుకోలేదు. విశాల్-ఆర్య నటించిన ‘ఎనిమీ’ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేశారు.
యాక్షన్ కథ ఆధారంగా తీసిన సినిమా ఇది. మిగిలిన కమర్షియల్ హంగులేవీ లేవు. పైగా ఎలాంటి లాజిక్ లేని మైండ్ గేమ్ ని ప్రేక్షకులపై రుద్దే ప్రయత్నం చేశారు. పండగ రోజు విడుదల కావడంతో ఈ సినిమాకి కొన్ని చోట్ల వసూళ్లు బాగానే వచ్చినప్పటికీ.. ఓవరాల్ గా మాత్రం సినిమాపై నెగెటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.
Most Recommended Video
రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!