Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Advertisement

టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో ‘మగధీర’ ఒకటి. రామ్ చరణ్ రెండో సినిమాగా వచ్చిన ఈ సినిమాని ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్ట్ చేశాడు.2009 లో వచ్చిన ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. కాల భైరవ, హర్ష వంటి 2 విభిన్నమైన పాత్రల్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కాజల్ గ్లామర్, నటన కూడా సినిమాకి ప్లస్ అయ్యాయి. షేర్ ఖాన్ పాత్ర చేసిన రియల్ స్టార్ శ్రీహరి కూడా మగధీర కి పెద్ద అసెట్ అని చెప్పాలి. ఇప్పటికీ ఆ పాత్ర పలికే డైలాగులు మార్మోగుతూనే ఉన్నాయి. అయితే, అప్పట్లో ఈ ఐకానిక్ పాత్రను చేయొద్దు అని శ్రీహరితో ఒకరు చెప్పారట! అది ఎవరో కాదు.. ఆయన సతీమణి డిస్కో శాంతి. మీరు చదువుతున్నది నిజమే..! స్వయంగా శ్రీహరి సతీమణి డిస్కో శాంతి .. ఈ కామెంట్స్ చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Disco Shanti

అందుకు గల కారణాలు కూడా ఆమె వివరించింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో డిస్కో శాంతి మాట్లాడుతూ..”శ్రీహరి గారు కెరీర్ ఆరంభంలో విలన్‌గా మెప్పించినా, ఆ తర్వాత హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అదే టైంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆఫర్లు కూడా రావడం మొదలయ్యాయి. అయితే నేను మాత్రం నా భర్త ఎప్పుడూ హీరోగానే వెండితెరపై కనిపించాలని ఆశపడ్డాను.నేను ఎప్పుడూ నన్ను ఒక హీరో భార్యగానే ఊహించుకున్నాను. హీరో అంటే హీరోనే.. సపోర్టింగ్ క్యారెక్టర్ అంటే సపోర్టింగ్ క్యారెక్టరే. ఆ వ్యత్యాసం నాకు అప్పట్లో చాలా స్పష్టంగా కనిపించేది.

అందుకే శ్రీహరి బావ సపోర్టింగ్ రోల్స్ చేస్తాను అంటే నాకు ఇష్టం లేక వద్దు అనేదాన్ని.’మగధీర’ కోసం
దర్శక ధీరుడు రాజమౌళి శ్రీహరిని సంప్రదించినప్పుడు..అందులో అతనిది సపోర్టింగ్ రోల్ (షేర్ ఖాన్) అని తెలిసి వద్దని వారించాను.కానీ అప్పటికే ఆయన కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తున్నారు. అయినప్పటికీ నా భర్త మళ్లీ హీరో స్థాయి నుండి సపోర్టింగ్ స్థాయికి వెళ్ళకూడదు అని నేను వద్దు అనేదాన్ని.కానీ తర్వాత ఆ పాత్రకి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలుసు” అంటూ చెప్పుకొచ్చింది.

శ్రీహరి ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవడం వల్లే మనకు ఒక షేర్ ఖాన్‌ అనే అద్భుతమైన పాత్రని చూసే అవకాశం దక్కింది. సినిమా పట్ల, నటన పట్ల శ్రీహరి గారికి ఉన్న అంకితభావం, పాత్ర ప్రాముఖ్యతను గుర్తించే ఆయన శైలిలో ఆ పాత్రకి న్యాయం చేశారు.అలా అని డిస్కో శాంతి గారి అభిప్రాయాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదు.ఏ భార్య అయినా తన భర్తను ఎప్పుడూ అత్యున్నత స్థానంలో ఉండాలని ఆశపడుతుంది కదా..!

మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus