దిల్లీలోని ఓ పోలీస్​ స్టేషన్​లో కేసు…

  • September 7, 2021 / 01:25 PM IST

దిశ రేప్‌ కేసు సమయంలో దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. ప్రజలు రోడ్ల మీదకు వచ్చి తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. ఆ పని చేసినవారికి తగిన శిక్ష వేయాలని డిమాండ్‌ చేశారు. సోషల్‌ మీడియా వేదికగా ఈ అంశంపై చాలామంది గళం వినిపించారు. ఈ క్రమంలో చాలామంది సెలబ్రిటీలు దిశ రేప్‌ కేసుకు సంబంధించి ట్వీట్లు పెట్టారు. అయితే వారి ట్వీట్లు ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కించేలా ఉన్నాయి. ఇంతకీ ఏమైందంటే…

2019లో హైదరాబాద్​లో దిశ హత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఆ రోజుల్లో సంచలనంగా మారిన ఆ కేసుకు సంబంధించి చాలామంది ట్వీట్లు, పోస్టులు చేశారు. మీరు కూడా చేసే ఉంటారు. లేదంటే చూసుంటారు. అయితే ఆ ట్వీట్లలో బాధితురాలి అసలు పేరును చాలామంది ట్వీట్లు, పోస్టలో పేర్కొన్నారు. అత్యాచార, హత్యాచార బాధితురాలి పేరు, ఆచూకీని తెలిపేలా ఎవరూ మాట్లాడకూడదు. ఎక్కడా ప్రస్తావించకూడదు. దీన్ని మరచిన సెలబ్రిటీలు ఆమె పేరును పోస్టుల్లో రాసుకొచ్చారు. దీంతో వారందరిపై కేసులు నమోదు చేయాలని న్యాయవాది గౌరవ్ గులాటీ… దిల్లీ తీస్ హజారీ కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు.

గౌరవ్‌ గులాటీ పిటిషన్‌లో మొత్తంగా 38 మందిని ప్రస్తావించారు. సెక్షన్ 228ఏ కింద ప్రముఖులపై కేసు నమోదు చేయాలని సబ్జీమండీ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు కూడా చేశారు గౌరవ్. దానిని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్​గన్, అభిషేక్ బచ్చన్, ఫరాన్ అక్తర్, అనుపమ్ ఖేర్… టాలీవుడ్ నటులు రవితేజ, అల్లు శిరీష్, కథానాయిక రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, నటి ఛార్మి పేర్లను ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరితోపాటు క్రీడాకారులు హర్బజన్ సింగ్, శిఖర్ ధావన్, సైనా నెహ్వాల్ పై కూడా కేసు నమోదు చేయాలని కోరారు.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus