Divi Vadthya: స్విమ్మింగ్ పూల్ వద్ద దివి గ్లామర్ ఫోజులు.. ఫోటోలు వైరల్

‘బిగ్ బాస్’ దివి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మహేష్ బాబు ‘మహర్షి’ వంటి పలు సినిమాల్లో నటించినప్పటికీ.. ‘బిగ్ బాస్ 4 ద్వారానే ఈమె మంచి పాపులారిటీ సంపాదించుకుంది అని చెప్పాలి. తర్వాత ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ ‘రుద్రంగి’ ‘గాడ్ ఫాదర్’ ‘పుష్ప 2’ వంటి పెద్ద సినిమాల్లో అవకాశాలు పొందింది. ఓ పక్క చిన్న చిన్న పాత్రలు పోషిస్తూనే.. ‘లంబ సింగి’ వంటి సినిమాల్లో మెయిన్ లీడ్ గా కూడా చేస్తూ వచ్చింది.

Divi Vadthya

ఇలా బిగ్ స్క్రీన్ పై ఆఫర్స్ పడుతూనే మరోపక్క స్మాల్ స్క్రీన్ పై కూడా పలు షోల్లో సందడి చేస్తూ వస్తోంది. ఈ భామకు సోషల్ మీడియాలో క్రేజ్ కూడా ఎక్కువే. ‘బిగ్ బాస్’ తర్వాత ఇన్స్టాగ్రామ్ ఖాతాకి ఫాలోవర్స్ సంఖ్య భీభత్సంగా పెరిగింది.

దివి వంటి భీభత్సమైన సోషల్ మీడియా ఫాలోవర్స్ సంఖ్య కలిగిన నటీమణులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఏ రకంగా అంటే.. ఏదైనా షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ లేదా.. బ్రాండ్ ప్రమోషన్స్ కోసం వీరిని పలు కార్పొరేట్ సంస్థలు సంప్రదిస్తూ ఉంటాయి. వాళ్ళ బ్రాండ్ ను కనుక.. వీళ్ళు తమ ఇన్స్టాగ్రామ్ లో ప్రమోట్ చేస్తూ పోస్ట్ లేదా రీల్ పెడితే.. లక్షల్లో వీరికి పారితోషికాలు ఇస్తూ ఉంటారు.

ఈ విషయంలో దివి కూడా టాప్ లోనే ఉంది. అందుకే పలు షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ లేదా బ్రాండ్ ప్రమోషన్స్ కోసం ఈమెను ఎక్కువగా సంప్రదిస్తూ ఉంటారు. అందుకే తన రేంజ్ ఏమాత్రం తగ్గకుండా నిత్యం.. పాపులర్ ఫోటోగ్రాఫర్స్ తో గ్లామర్ ఫోటో షూట్లు చేయించుకుంటూ ఉంటుంది ఈ అమ్మడు. తాజాగా స్విమ్మింగ్ పూల్ వద్ద ఈమె గ్లామర్ ఫోజులు ఇస్తూ చేసిన ఫోటో షూట్ హాట్ టాపిక్ అయ్యింది. ఆ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

‘కార్తికేయ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus