Divi: సాగరకన్యాలా మారిన బిగ్ బాస్ బ్యూటీ..బిగ్ బాస్ బ్యూటీ దివి లేటెస్ట్ ఫోటోలు వైరల్!

సోషల్ మీడియాలో అందాలు ఆరబోయడంలో నువ్వా నేనా అన్నట్లుగా మారిపోయింది ట్రెండ్. అందాలు ఆరబోస్తూ పాపులర్ కావడమే గాక ఫాలోయింగ్ కూడా పెంచుకుంటున్నారు నేటితరం యంగ్ లేడీస్. ఈ క్రమంలోనే తాజాగా దివి వాద్య షేర్ చేసిన కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఆన్ లైన్ మాధ్యమాలపై యాక్టివ్‌గా ఉండే దివి వాద్యా ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ లుక్స్ పోస్ట్ చేస్తూ కుర్రకారు మనసు దోచేస్తోంది. తన అందాలన్నీ ఆన్ లైన్ తెరపై పరిచేసి ఎండాకాలంలో మంట పెట్టింది దివి.

మోడలింగ్ రంగం నుంచి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది యాక్టర్ దివి వాద్యా. మొదట లెట్స్ గో, సీన్ నెంబర్ 72 సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించినా రాణి గుర్తింపు బిగ్ బాస్ ద్వారా తెచ్చుకుంది దివి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ‘మహర్షి’ సినిమాలో కాలేజ్ స్టూడెంట్‌గా దివి నటించింది. పాత్ర నిడివి చిన్నదే అయినా మహేష్ సినిమా కావడంతో అందరి కన్ను ఆమెపై పడింది. ఇక బిగ్ బాస్‌లో పార్టిసిపెంట్‌గా ఛాన్స్ రావడం దివి జాతకాన్ని మార్చేసిందని చెప్పుకోవచ్చు.

హౌస్‌లో హాట్ హాట్‌గా కనిపిస్తూ రచ్చ రచ్చ చేసి తెగ పాపులర్ అయింది దివి. దీంతో అమ్మడి ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. బిగ్ బాస్ 4 నుంచి బయటకు వచ్చిన వెంటనే అమ్మడి ఫేట్ మారిపోయింది. వరుస ఆఫర్స్ తలుపుతడుతుండటంతో బిజీ ఆర్టిస్ట్ అయింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్, ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేస్తోంది ఈ బిగ్ బాస్ బ్యూటీ. మరోవైపు నిత్యం ఏదో ఒక ఫోటోషూట్‌తో నెటిజన్లను, ఫాలోయర్స్‌ను అట్రాక్ట్ చేస్తుండటం హాబీగా పెట్టుకుంది దివి.

రోజుకో తీరు గ్లామర్ యాంగిల్స్ వదులుతూ రచ్చ చేస్తోంది. అందాల ఆరబోతలో తగ్గేదే లే అన్నట్లుగా వ్యవహరిస్తోంది. అప్పట్లో బిగ్ బాస్ ఫైనల్ గెస్టుగా వచ్చిన చిరంజీవి.. దివి అందానికి ఫిదా అయి ఆమెకు గాడ్ ఫాదర్’ సినిమాలో అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె క్యాబ్ స్టోరీస్, లంబసింగి అనే సినిమాల్లో నటించింది. అలాగే నయీం డైరీస్ మూవీలో దివి చేసిన హాట్ సీన్ ఆమె క్రేజ్ అమాంతం పెంచేసింది.

ఈ రోజు (ఏప్రిల్ 25) (Divi) దివి వడ్త్యా పుట్టిన రోజు సందర్బంగా లేటెస్టుగా ఫోటోషూట్ కోసం సాగరకన్యలా దివి మారిపోయారు. అందాల శిల్పంలా… శిల్పా శెట్టి చేసిన క్యారెక్టర్ లోకి వెళ్లి అందాల ప్రదర్శన చేశారు. అమ్మడి అందాల విందుకి ఆడియన్స్ అంతా ఫిదా అవుతున్నారు. ఈ అందాల భామకు ఛాన్స్ లు ఎందుకు రావట్లేదో కానీ దివికి సరైన ఛాన్స్ వస్తే మాత్రం అదరగొట్టేస్తుందని చెప్పొచ్చు.



విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus